Connect with us

Movies

సోనోరీటా పాటను విడుదల చేసిన పాంచాలీ పంచభర్తృక చిత్ర బృందం @ Alpharetta, Georgia

Published

on

Atlanta, Georgia, January 18, 2025: ‘పాంచాలీ పంచభర్తృక’ (Panchali Pancha Bharthruka) సినిమాలోని రెట్రో సాంగ్ ఘనంగా విడుదల చేశారు. ఆల్ఫారెటా (Alpharetta) పట్టణంలోని దేశానా మిడిల్ స్కూల్లో (DeSana Middle School) నిర్వహించిన కార్యక్రమంలో సోనోరీటా అంటూ సాగే పాటను విడుదల చేసి చిందులేయడం ఆసక్తిని పెంచింది.

దాన వీర శూర కర్ణ సినిమాలో నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao – NTR) పలికిన ఫేమస్ డైలాగునే సినిమా పేరుగా పెట్టుకోవడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లోగో మరియు పోస్టర్ ఈ మధ్యనే లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఈ పాట కూడా అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గంగాధర్ సప్తశిఖర (Gangadhar Sapthasikhara) దర్శకత్వంలో, రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్ మరియు ఓం సాయిరాం ఆర్ట్స్ సమర్పణలో ఈ ‘పాంచాలీ పంచభర్తృక’ సినిమా తెరకెక్కింది.

తెలుగు సినిమా కామెడీ మొఘల్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), ప్రముఖ నటులు జెమినీ సురేష్, రోల్ రీడా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) తోపాటు అట్లాంటా నుంచి వెంకట్ దుగ్గిరెడ్డి మరియు పవన్ పూసర్ల నటించడం విశేషం.

వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) ఇప్పటికే దాదాపు 11 సినిమాలలో నటించి విజయపథంలో నడుస్తుండగా పవన్ పూసర్ల (Pavan Pusarla) టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మొట్టమొదటి సినిమాతో ప్రేక్షకుల మధ్యకి వస్తున్నారు.

గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (Greater Atlanta Telugu Association – GATA) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ఈ సోనోరీటా పాటను విడుదల చేశారు. గాటా నాయకులు ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ తెలిపారు. ఇంకా జబర్దస్త్ నవీన్, రూప లక్ష్మి, జయవాణి, రేష్మ సుల్తానా, రవి తదితరులు ఈ సినిమాలో నటించారు.

error: NRI2NRI.COM copyright content is protected