Guntur, Andhra Pradesh: ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ గారి సారథ్యంలో, శ్రీ పి రామచంద్ర రాజు గారు ముఖ్య సమన్వయకర్తగా, గుంటూరులో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల (3rd World Telugu Conference) రెండవ రోజు, 04-01-2026 నాడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లూ ఇంద్రసేనా రెడ్డి గారి చేతుల మీదుగా, అనేక రంగాల దిగ్గజుల సమక్షంలో “ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం” అందుకోవడం నాకు జీవితంలో మరిచిపోలేని కృతజ్ఞతా పూర్వక అనుభూతి.
సాంస్కృతిక రంగంలో నేను అంకితభావంతో చేసిన, చేస్తున్న సేవలను గుర్తించి, ఇంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని ఇంత గొప్ప అంతర్జాతీయ వేదికపై ప్రసాదించడం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ అపూర్వ గౌరవాన్ని అందించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ గారికి (Dr Gazal Srinivas), అలాగే పరిషత్తు కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయాంతర కృతజ్ఞతలు.
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ రమేష్ కుమార్ గారు, మాజీ మంత్రి శ్రీమతి నన్నపనేని రాజకుమారి (Nannapaneni Rajakumari) గారు, మహావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు తదితర మహనీయుల సన్నిధి ఈ సత్కారాన్ని మరింత గౌరవప్రదంగా మలిచింది. మారిషస్ దేశ అధ్యక్షులు, నాలుగు రాష్ట్రాల గవర్నర్లు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) గారు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి. రమణ గారు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, పండితులు, కవులు, కళాకారులు, వివిధ దేశాల తెలుగు సంఘాల ప్రతినిధుల హాజరు ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను నిజంగా “నభూతో న భవిష్యత్” అనే స్థాయికి చేర్చింది.
ఈ పురస్కారం నా వ్యక్తిగత కృషికే కాకుండా, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన మిత్రులు, సహచరులు, భాగస్వాములు, మార్గదర్శకులు, మీడియా మిత్రులకు మరియు సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి గుర్తింపు”. ఈ గౌరవం నన్ను మరింత సేవాభిముఖుడిగా నిలిపే ప్రేరణగా నిలుస్తుంది అని భావిస్తున్నాను.
– వెంకప్ప భాగవతుల, Qatar