ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే చేతన ఫౌండేషన్ ఎవ్రీ చైల్డ్ రీడ్స్(Every Child Reads) కార్యక్రమానికి చేయూతగా చేతన ఫౌండేషన్ (Chetana Foundation) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్, సౌండ్ సిస్టమ్ పంపిణీ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ కెనడా ప్రతినిధి (Foundation Canada Representative) నెమలిపురి సీతారామారావు (Nemalipuri Seetharamarao) అన్నారు.
మంగళవారం చేతన ఫౌండేషన్, సీతారామారావు కుటుంబం సంయుక్త ఆధ్వర్యంలో ఆయన బాల్యంలో చదువుకున్న పొన్నెకల్లు ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రింటర్, సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సీతారామారావు మాట్లాడుతూ.. గౌరవ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) ప్రారంభించిన “ఎవ్రీ చైల్డ్ రీడ్స్ (Every Child Reads)” కార్యక్రమానికి చేయూతగా ఈ విరాళాలను అందించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చేతన ఫౌండేషన్ (Chetana Foundation) సభ్యుడు ముత్తినేని సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీతారామారావు కుటుంబ సభ్యులు స్వప్న, శ్రీ వత్స, ప్రియ, చేతన (Chetana Global Foundation) ఫౌండేషన్ సభ్యులు ముత్తినేని సురేష్, చంద్రకాని నవీన్, షేక్ రషీద్, ఏఏపీసీ ఛైర్మన్ పి. రాజ్యం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్, కె.వి. రమణ, ఉపాధ్యాయులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.