ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న చేతన గ్లోబల్ ఫౌండేషన్ (Chetana Global Foundation) కెనడా (Canada) ప్రతినిధి గా నెమలిపురి సీతారామారావు ని నియమిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ వెనిగళ్ళ (Ravikumar Venigalla) పేర్కొన్నారు.
సీతారామారావు స్వగ్రామం ఖమ్మం (Khammam, Telangana) రూరల్ మండలం పొన్నెకల్లు. ప్రస్తుతం ఆయన కెనడా (Canada) లో నివసిస్తున్నారు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన కెనడా లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) గా పని చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన కెనడా, భారతదేశం (India) లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్థానిక గట్టయ్య సెంటర్ లో బుధవారం జరిగిన చేతన గ్లోబల్ ఫౌండేషన్ (Chetana Global Foundation) కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫౌండేషన్ కెనడా (Canda) ప్రతినిధిగా నియమించటం పట్ల చేతన ఫౌండేషన్ సభ్యులు సీతారామారావు దొడ్డా, సురేష్ ముత్తినేని, నవీన్ చంద్రకాని, రషీద్ షేక్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.