Mahbubnagar, Telangana: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరం – ATA వేడుకలు 2025 వేడుకల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో ప్రొఫెసర్ బత్తిని కాంతారెడ్డి, వారి కుమారుడు ఆటా సభ్యుడు హరీష్ బత్తిని సహకారంతో గ్రామీణ విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి లక్ష్యంగా రెండు ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో యాగశాల ప్రారంభోత్సవం, ఫంక్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమాలు, అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం వాటర్ ఫిల్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే గవినొల్ల మధుసూదన్ రెడ్డి (Gavinolla Madhusudan Reddy) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు స్వదేశంలోని గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. విద్య, ఆరోగ్యం, సంస్కృతి పరిరక్షణలో ఆటా సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు.
అనంతరం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ… ఆటా (ATA) ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సేవ కార్యక్రమాలతో పాటు హరీష్ బత్తిని సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జివిఆర్ ను ఆటా ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని (Narasimha Dyasani), సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.