క్రీడలు మానసికల్లోసాన్ని కలిగిస్తాయని ఆటా (ATA) ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో, ఎస్ఈ & పిఎస్ (సేవ్ ఎన్విరాన్మెంట్ & పబ్లిక్ స్కూల్స్) సహకారంతో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) ఘనంగా సాగింది.
రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School) మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగియగా, విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను రెండు రాష్ట్రాల్లో, మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని ఆటా నాయకులు (ATA Leaders) తెలిపారు.
ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి (Satish Reddy) మాట్లాడుతూ… విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల (Government Schools) విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని (Sai Sudhini), ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి (Parmesh Bheemreddy), రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం (Vishnu Madhavaram), హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.