Connect with us

Fundraiser

Bothell, Washington: విజయవంతంగా శంకర నేత్రాలయ ఫండ్రైజర్, హాజరైన డిప్యూటీ మేయర్ & కౌన్సిల్ సభ్యులు

Published

on

Bothell, Washington: శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్‌ (Empire Banquet & Conference Hall) లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం — సంగీత విభావరి — ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.

కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్‌మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల గారు మరియు సృజనా గారు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ప్రముఖ గాయకులు సుమంగళి (Sumangaly Ariyanayagam), అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించబడింది.

ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ (Bothell, Washington) డిప్యూటీ మేయర్ శ్రీ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు శ్రీ అంగులూరి గారు తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ (Sankara Nethralaya USA) చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.

2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్రీ భాస్కర్ గంగిపాముల గారు, శ్రీ రామ్ కొట్టీ గారు, 2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (శ్రీ వంశీ రెడ్డి కె గారు, శ్రీ రామ్ పాలూరి గారు, శ్రీ భాస్కర్ జీ గారు), శ్రీ విక్రమ్ గార్లపాటి గారు, శ్రీమతి వర అక్కెల్ల గారు, శ్రీ రాహుల్ & శ్రీమతి అనీలా గారు, శ్రీ నంద కిషోర్ గజుల గారు.

అలాగే 2025 స్పాన్సర్లుగా శ్రీ అశోక్ గల్లా గారు, శ్రీ రాజేశ్ గుడవల్లి గారు, శ్రీ అశోక్ పసుపులేటి గారు, శ్రీ వినోద్ నాగుల గారు, శ్రీ కృష్ణ ఉంగర్ల గారు, శ్రీమతి శ్వేత సానగపు గారు, శ్రీ రాజేశ్ అర్జా గారు మరియు Seattle Boys Club — ముందుకు వచ్చి మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయబడుతున్నాయి.

డెకరేషన్ టీమ్ Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

Sankara Nethralaya USA జాతీయ అధ్యక్షుడు శ్రీ బాలా రెడ్డి ఇందుర్తి (Bala Reddy Indurti) గారి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

శంకర నేత్రాలయ (Sankara Nethralaya USA) బోర్డ్ ట్రస్టీలు శ్రీ సోమ జగదీశ్ గారు కుటుంబంతో, శ్రీ వినోద్ గారు కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డ (Jayapal Reddy Dodda) గారి మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు మరియు వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని అద్భుత విజయంగా నిలిపారు.

సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ (Sankara Nethralaya USA) సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి (Concert) విలువైన మద్దతును అందించింది.

error: NRI2NRI.COM copyright content is protected