Kamareddy, Telangana: అక్షరం ఒక్కటే జీవితాలను మార్చుతుందని బలంగా నమ్మిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) నాట్స్.. పేద విద్యార్ధులకు సాయం అందించడంలో వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించింది.
తాజాగా కామారెడ్డిలో నాట్స్ బాలల సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల సందర్భంగా క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఉత్తమంగా రాణించిన వారికి నాట్స్ బహుమతులు పంపిణీ చేసింది. పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి నాట్స్ (NATS) తన వంతు కృషి చేస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashanth Pinnamaneni) అన్నారు.
ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వీసా ప్రక్రియలు, మరెన్నో అంశాలపై నాట్స్ అవగాహన కల్పిస్తుందని అన్నారు. కామారెడ్డిలో ఎన్నారై శ్యాం సుందర్ రెడ్డి బాలల సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) అన్నారు.
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ (NATS) అండగా నిలబడుతుందని తెలిపారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ కార్య నిర్వహక సభ్యులు కిరణ్ మందాడి (Kiran Mandadi) స్థానిక ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగ సంఘాలకు కావాల్సిన క్రీడా పరికరాలను కూడా నాట్స్ ఉచితంగా అందించింది.