Connect with us

Food Drive

New Jersey: నాట్స్ జాతీయ స్థాయిలో తలపెట్టిన ఫుడ్ డ్రైవ్‌కు న్యూజెర్సీ లో మంచి స్పందన

Published

on

New Brunswick, New Jersey: భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS).. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా న్యూజెర్సీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్‌ను (Food Drive) ఈ సారి కూడా చేపట్టింది..

నాట్స్ జాతీయ స్థాయిలో తలపెట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు న్యూజెర్సీ (New Jersey) లో మంచి స్పందన లభించింది.  వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఫుడ్ క్యాన్స్‌ను నాట్స్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సేకరించి న్యూ బ్రన్స్విక్ లోని ఓజనం ఛారిటీ సెంటర్ నిర్వాహకులకు అందించారు. ఆకలితో ఉండే అభాగ్యుల కోసం లక్ష ఫుడ్ క్యాన్స్ సేకరించాలని నాట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

దానిలో భాగంగానే అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. న్యూజెర్సీలో నాట్స్ సభ్యులు, నాయకులు ఈ  ఫుడ్ డ్రైవ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు విద్యార్ధులు తనీష్ అన్నం, దియా మందాడి, సూర్య టేకీ, జతిన్ మందడి, ప్రణవ్ గడ్డిపాటి, లోలిత్య కుంచె, వియాన్ వెనిగళ్ల, పర్ణిక తెల్ల, భవిన్ తెల్ల, శ్రీనిక నూతలపాటి, ప్రీతి గుత్తికొండ, శరణ్ మందడి తదితరు కిడ్స్ వాలంటీర్ (Volunteer) లు ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్నారు.

నాట్స్ ద్వారా నిర్వహించే ఈ ఫుడ్ డ్రైవ్‌లో విద్యార్ధులు పాల్గొనటం వల్ల వారికి సర్వీస్ అవర్స్ (Volunteer Service Hours) కూడా కలిసి వచ్చి అది వారి ఉన్నత చదువులకు, మంచి కాలేజీల్లో ప్రవేశాలకు దోహదపడనుంది. పేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని ఈ డ్రైవ్‌లో పాల్గొన్న విద్యార్ధులు తెలిపారు.

నాట్స్ తమను ఇంత చక్కటి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు వారు నాట్స్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫుడ్ డ్రైవ్‌లో నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళీకృష్ణ మేడిచెర్ల, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి (Kiran Mandadi) పాల్గొన్నారు.

అలాగే న్యూజెర్సీ జాయింట్ సీ ఆర్డినేటర్ ప్రసాద్ టేకీ, నాట్స్ న్యూజెర్సీ నాయకులు రమేష్ నూతలపాటి (Ramesh Nuthalapati), చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, మల్లి తెల్ల, ఈశ్వర్ అన్నం, శ్రీనివాస్ కొల్లా, ప్రభాకర్ మూల, సత్య కుంచె తదితరులు  కూడా పాల్గొని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected