Connect with us

Cultural

Chicago, Lemont: 1000+ అతిథుల సమక్షంలో వైభవంగా చికాగో ఆంధ్ర సంఘం 9వ సాంస్కృతికోత్సవాలు

Published

on

Chicago, Illinois: చికాగో ఆంధ్ర సంఘం వారి 9 వ సాంస్కృతికోత్సవాలు హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో, Lemont లో నవంబర్ 8 వ తేదీన సుమారు 1000 మంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపారు. సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి స్వాగతోపన్యాసము తో కార్యక్రమము ప్రారంభించగా, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu) గారు అతిధులను పరిచయము చేసారు.

ఈ కార్యక్రమము సంస్థ ఫౌండింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుందర్ దిట్టకవి (Sundar Dittakavi) గారు, పూర్వ అధ్యక్షులు శ్రీ శైలేష్ మద్ది (Sri Sailesh Maddi) గారు మరియూ సంస్థ కార్యవర్గ సభ్యులు శృతి కూచంపూడి  గారు తమదైన శైలి లో వాఖ్యాత గ వ్యవహరిస్తూ  అధ్యాంతము అతిదులందరిని అలరించారు. ఉపాధ్యక్షులు శ్రీమతి తమిశ్రా కొంచాడ ఆధ్వర్యములో, కార్య వర్గ సభ్యులు మరియూ స్వాగత బృంద సభ్యులైన కిరణ్ వంకాయలపాటి గారు, హేమంత్ తలపనేని గారు, పద్మారావు అప్పాలనేని గారు, ప్రభాకర్ మల్లంపల్లి గారు అతిధులను స్పాన్సర్లను చిరునవ్వుతో ఆహ్వానించి వారి వారి కేటాయించ బడిన సీట్స్ వద్దకు పంపించారు.

సంస్థ స్పాన్సర్స్ PMSI గ్రూప్ Ashoka Lakshmanan గారు, HyperKids Play area  మహేష్ ఎరుకుల గారు, Meda Dental Dr. Meda,  EyeLevel Learning ఝాన్సీ అండ్ ప్రియా గారు, AllState Insurance Asim Hamidi గారు, సరితా బుడితి గారు, స్కంద జెవెలర్స్ Raj Munaga గారు, KW Reality SaiRavi and Raj గారు, డేలైట్ ఎనర్జీ ,  Krasan Consulting Dinakar Karumuri గారు, GradePower Learning Alex Durbin తదితరులు వారి సహాయము అందించి ఈ కార్యక్రమము విజయవంతముగా నిర్వహించదానికి సహకరించారు.

CAA అంటే అందరికీ ముందుగా స్పృశించేది, వారు ఎంచుకొని ప్రదర్శించే కార్యక్రమాలు – చక్కని ప్రేమతో వడ్డించే విందు. ఈసారి సాంసృతిక (Cultural) విభాగము కార్యవర్గ సభ్యులు అనూష బెస్త (Anusha Besta) ఆధ్వర్యంలో శైలజ సప్ప , శ్రీస్మితా నండూరి సహకారముతో సుమారు 300  మంది చిన్న పెద్ద కళాకారులతో ఎన్నో కార్యక్రమాలు సమన్వయపరచి  ప్రదర్శించారు.

ముఖ్యముగా, సంకీర్తన గ్రూప్ (Sankirtana Group) వారి సరళ సంగీత శ్లోకాలు , చిన్నారులు చేసిన వైవిధ్య భరితమైన నృత్యాలు, లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారి హస్య సన్నివేశాలు, సభ్యుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో కూడిన టీం 2025 చేసిన టీం ధమాకా, SPB నివాళి (SPB Tribute) కార్యక్రమము వీక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంది అందులో చికాగో సీనియర్స్ చేసిన నృత్యము ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.

CAA ఫుడ్ కమిటీ, Tollywood Lounge  Restaurant (శ్రీహరిజాస్తి, ఆది కంచర్ల) భాగస్వామ్యంతో ప్రత్యేకంగా కూర్చిన ఆంధ్ర వంటకాలను అందించింది. చెఫ్స్ ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం చేసిన ఈ వంటకాలు ప్రతి అతిథికి ఆంధ్ర రుచుల అసలైన అనుభూతిని కలిగించాయి. యువ వాలంటీర్లు (Volunteers) తమ అంకితభావం, ప్రేమ, మర్యాదతో ప్రతి అతిథికి ఆహారం అందించి సేవా స్పూర్తిని ప్రతిబింబించారు.

ఫుడ్ డైరెక్టర్ మురళి రెడ్డివారి తెలుగు సినిమా థీమ్‌తో వంటకాలను అందించి అతిథులకు ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగించారు. ఈ వేడుక సందర్భము గా, సభ్యులందరికీ CAA  యాజమాన్యం తరపున తాపేశ్వరం సురుచి వారు తయారు చేసిన ప్రత్యేకమైన పిండి వంటల ప్యాకెట్ అందచేశారు.

కృష్ణ డెకార్స్ (Krishna Jasti) వేదికను అందముగా తీర్చి దిద్దగా, ఈ కార్యక్రమంలోని ఫోటోలు మరియు వీడియోలను కాస్మోస్ డిజిటల్ సొల్యూషన్స్ నుండి సూర్య దాట్లా కవర్ చేశారు.CAA వారి సేవ విభాగము Chicago Andhra Foundation (CAF) తరపున కార్యనిర్వహణ అధికారి సునీత రాచపల్లి , ఉప కోశాధికారి అనుపమ గంపల CAF స్టాల్ నిర్వహించి, సభ్యులకు ఇప్పటివరకు జరిపిన సేవ కార్యక్రమాలు, అందులో ఎలా భాగస్వామ్యము అవ్వచో వివరించారు.

ఈ సందర్భముగా జరిపిన raffle లో పలువురు బహుమతులు పొందారు. ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ శాస్త్రీయ సంగీత  గాయనీ గుడిపాటి శ్రీలలిత , మణి తెల్లప్రగడ , శ్రేయ బొజ్జ, రవి తోకల, సౌజన్య రాళ్లబండి, హితేషి కొప్పరం బృందం తో చేసిన సంగీత కార్యాక్రమము అందరినీ ఆకట్టుకొంది. 

గాయని శ్రీలలిత పాడిన ‘భావయామి’ పాటకు  తన్మయత్వం పొందిన  సభ్యులు లేచి కరాళ ధ్వనులతో అభినందించారు. ఈ సందర్భము గా CAA బృందం గాయని శ్రీలలిత ను జ్ఞాపిక తో సత్కరించారు. ఈ కార్యక్రమ విజయం కోసము గత కొన్ని నెలలుగా  BODs నరసింహ రావు వీరపనేని గారు, గిరిరావు కొత్తమాసు గారు, రామారావు కొత్తమాసు గారు, సాహితి కొత్త గారు, నరసింహ రెడ్డి ఒగ్గు గారు మరియు యువ నాయకులు స్మరన్ తాడేపల్లి, శ్రేయ కొంచాడ, మయూఖ రెడ్డివారి తదితరులు తెరవెనుక , తెరముందూ ఎంతో సహకారము అందించారు.

CAA  ధర్మ కర్తలు దినకర్ పవిత్ర కారుమూరి గారు, రాఘవ జాట్ల శివ బాల గారు, ఉమా కటికి భాస్కర్ గారు, ప్రసాద్ భార్గవి నెట్టెం గారు, సుందర్ దిట్టకవి వాణి గారు, పద్మారావు అప్పాలనేని సుజాత గారు, రమేష్ గారపాటి శిరీష గారు,  తన్వి జాట్ల గారు, ఉష అప్పాలనేని గారు, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు మల్లేశ్వరి గారు, వారితో పాటుగా సంస్థ పూర్వాధ్యక్షులు శ్రీ శైలేష్ మద్ది గారు, మాలతీ దామరాజు గారు, గౌరీ అద్దంకి గారు, శ్వేతా కొత్తపల్లి గారు ఈ సాంస్కృతిక ఉత్సవాలను పర్యవేక్షించి తగిన సూచన సలహాలతో విజయానికి తోడ్పాటు అందించారు.

 సంస్థ (Chicago Andhra Association) సెక్రటరీ శ్రీస్మితా నండూరి, అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారు ధన్యవాద తీర్మానంలో ఈ కార్యక్రమము నిర్వహించడానికి తోడ్పడిన ఎంతోమంది వాలంటీర్స్, సభ్యులు, HTGC టెంపుల్ యాజమాన్యము, సాంస్కృతిక సమన్వయకర్తలు, స్పాన్సర్స్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected