Connecticut, November 19, 2025: అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా కనెక్టికట్లో తన విభాగాన్ని ప్రారంభించింది. దాదాపు 200 మందికి పైగా తెలుగు వారు ఈ కనెక్టికట్ చాప్టర్ (NATS Connecticut Chapter) ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.
నాట్స్ కనెక్టికట్ కోఆర్డినేటర్గా శ్రీమన్నారాయణ ముప్పనేని (Srimannarayana Muppaneni) కి నాట్స్ జాతీయ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కనెక్టికట్లో తెలుగు వారి కోసం నాట్స్ ఇక నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని.. తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashanth Pinnamaneni) అన్నారు.
కనెక్టికట్లో తెలుగు వారిని కలిపే ప్రతి కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకత్వం తన సంపూర్ణ మద్దతు అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) తెలిపారు. కనెక్టకట్లో నాట్స్ విభాగం తెలుగు వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని నాట్స్ కార్యనిర్వహక సభ్యులు కిరణ్ మందాడి (Kiran Mandadi) అన్నారు.
నాట్స్ (NATS) లక్ష్యాలను, సేవలను నాట్స్ జాతీయ నాయకులు వివరించారు. నాట్స్ కనెక్టకట్ చాప్టర్ ప్రారంభోత్సవ వేడుకకు మసాచుసెట్స్ (Massachusetts), న్యూజెర్సీ (New Jersey) చాప్టర్ల నుండి తెలుగు కుటుంబాలు, నాట్స్ సభ్యులు వచ్చి తమ మద్దతు ప్రకటించారు.
కనెక్టకట్లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరం చేయడంలో తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాట్స్ కనెక్టకట్ చాప్టర్ కో ఆర్డినేటర్ (Coordinator) శ్రీమన్నారాయణ ముప్పనేని హామీ ఇచ్చారు. నాట్స్ కనెక్టకట్ చాప్టర్ (NATS Connecticut Chapter) నాయకులను వేదికపై అందరికి పరిచయం చేశారు.
నాట్స్ కనెక్టకట్ విభాగ నాయకుల వివరాలు
శ్రీమన్నారాయణ ముప్పనేని – కనెక్టికట్ చాప్టర్ కోఆర్డినేటర్
శ్రీనివాస చక్రవర్తి చాలికొండ – జాయింట్ చాప్టర్ కోఆర్డినేటర్
సుదీప్తి ముప్పనేని – మహిళా సాధికారత లీడ్
మాధురి గాండ్ల – సోషల్ మీడియా లీడ్
మోహనకృష్ణ నన్నేబోయిన – ఈవెంట్స్ కోఆర్డినేటర్
శివశంకర్ కందిమళ్ళ – స్పోర్ట్స్ కోఆర్డినేటర్
రాజేష్ తాడపనేని – కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్