Connect with us

Leadership

అమెరికా అంతటా నాట్స్ విస్తరణ, భారీ జనసందోహం నడుమ NATS Colorado Chapter ప్రారంభం

Published

on

Colorado, నవంబర్ 19: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) క్రమంగా అమెరికా అంతటా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొలరాడోలో నాట్స్ తన విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి లు కొలరాడో చాప్టర్‌ను అధికారికంగా ప్రారంభించారు.

భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న నాట్స్ (NATS) గురించి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కొలరాడో నాట్స్ సభ్యులకు వివరించారు. కొలరాడో నాట్స్ విభాగం చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ మద్దతు పుష్కలంగా ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) తెలిపారు.

కొలరాడో (Colorado) నుంచి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ గా అనుదీప్ ఆర్ల బాధ్యతలు స్వీకరించారు. సాటి తెలుగువారికి సేవ చేయాలనే సంకల్పం, అనుదీప్ నాయకత్వ లక్షణాలు కొలరాడోలో నాట్స్‌ (NATS) కార్యక్రమాలను ముమ్మరం చేయడంలో దోహదపడతాయని నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్ మద్దినేని విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే నాట్స్ కొలరాడో విభాగం (NATS Colorado Chapter) నాయకులను నాట్స్ జాతీయ నాయకత్వం వేదికపై అందరికి పరిచయం చేసింది. ఈ చాప్టర్ ప్రారంభోత్సవ వేడుకలో కొలరాడోతో పాటు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల నుండి 350 మందికిపైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కొలరాడో చాప్టర్ నాయకులను నాట్స్ జాతీయ నాయకులు, నాట్స్ కొలరాడో తెలుగు ప్రజలు అభినందించారు.

నాట్స్ కొలరాడో చాప్టర్ (NATS Colorado Chapter) ప్రారంభోత్సవ వేడుకలోనే తెలుగు వారికి ఉపయోగపడే అనేక అంశాలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించింది. వలసదారుల మద్దతు, ఆరోగ్యం, సంక్షేమం, మార్గదర్శకత్వం, వీలునామా, ట్రస్ట్ యొక్క ప్రాముఖ్యత, కుటుంబం, విద్య, యువత, కెరీర్ మద్దతు ఇలా అనేక అంశాలపై తెలుగు వారి ప్రశ్నలకు నిపుణులు చక్కటి సమాధానాలతో వివరించి అవగాహన కల్పించారు.

నాట్స్ కొలరాడో చాప్టర్ నాయకత్వ బృందం
మంజుల కుంటముక్కల – చాప్టర్ కోఆర్డినేటర్
ప్రత్యూష అప్పారసు – జాయింట్ కోఆర్డినేటర్
సత్యజీ చిగురుపాటి – ట్రెజరర్
రోహిణికుమార్ గోమఠం – ఈవెంట్ & లాజిస్టిక్స్ చైర్

శిల్పా రాణి బాసోలే – మెంబర్‌షిప్ చైర్
సాయి చరణ్ మారుపూడి – పీఆర్ & మీడియా చైర్
సాయి కృష్ణ దిరిసాల – పీఆర్ & మీడియా కో-చైర్
సింధురెడ్డి రామసహాయం – కమ్యూనిటీ ఔట్రీచ్ చైర్
దివ్య చంద్రిక రాయిల్లా – మెంబర్‌షిప్ కో-చైర్

ఆశిష్ దాకరాపు – నాట్స్ కల్చరల్ చైర్
సమీద్ సామి – ఆడియో-వీడియో కోఆర్డినేటర్
హేమంత్ బోడిపాటి – నాట్స్ విజువల్ కోఆర్డినేటర్
అభిలాష్ రెడ్డి తామటం – నాట్స్ స్టూడెంట్ కోఆర్డినేటర్

error: NRI2NRI.COM copyright content is protected