Connect with us

Financial Assistance

బాలయ్య వీరాభిమాని కుటుంబానికి NRI రవి పొట్లూరి ఆర్ధిక సహాయం @ Kurnool, Andhra Pradesh

Published

on

Kurnool, Andhra Pradesh: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల తొక్కిసలాటలో మృతి చెందిన ఆదోని వాసి చిన్న ఆంజనేయ కుటుంబానికి తానా (Telugu Association of North America – TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.

చిన్న ఆంజనేయ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna – NBK) కు వీరాభిమాని కావడంతో తన ఎడమ చేతికి NBK అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో భాగంగా మాలమల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో మృతి చెందారు.

మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మృతుడు చిన్న ఆంజనేయ భార్య ఈరమ్మ, కుమారుడు రామాంజి కు ఎన్నారైలు రవి పొట్లూరి (Ravi Potluri), వెంకట్ సుంకర, వేణు కోడే, సుబ్రమణ్యం ఒసూరు తదితరులు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం (Nandamuri Balakrishna Fans Association) అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సందడి మధు, మీనాక్షి, మనోహర్ చౌదరి, బాబు, మార్కండి, నాగరాజ్, లక్మన్న తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected