Toronto, Canada: కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (Ontario Telugu Foundation – OTF) ఆధ్వర్యంలో దీపావళి పండుగ వేడుకలు Toronto లోని ఈస్ట్‌డేల్ ఆడిటోరియం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 1000 కి పైగా తెలుగు కమ్యూనిటీ బంధుమిత్ర పరివారం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భావన పగిడేలా, అపర్ణ కందుల, రిందా శాంతపురం, విలోక్ చల్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేదిక అందుబాటు సమస్యలు మరియు పండుగ కాలం కారణంగా ఈ సంవత్సరం దీపావళి (Diwali) వేడుకలను కొంచెం ఆలస్యంగా నిర్వహించడం జరిగింది. మీ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు!
ఈ దీపావళి వేడుకలు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (Ontario Telugu Foundation – OTF)మహిళా సమన్వయకర్తలు – ఝాన్సీ బదాపురి, దీప సూదిరెడ్డి, పద్మిని నారు, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, లావణ్య ఆలూరి జ్యోతి ప్రజ్వలనతో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో (Cultural Programs) అన్ని వయసుల తెలుగు పిల్లలు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళారూపాలు వేడుకకు మరింత వైభవాన్ని చేకూర్చాయి. ఈ సందర్భంగా సమన్వయకర్తలు ప్రవీణ్ నీల గారు, మురళీధర్ పగిడేలా గారు మాట్లాడుతూ , మన హైందవ సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే ఇలాంటి వేడుకల్ని నిర్వహించడం ద్వారా ఒంటారియో కెనడా తెలుగు ప్రజల సంఘటిత శక్తిని కొనియాడుతూ Ontario Telugu Foundation (OTF) సంస్థకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ICICI బ్యాంకు కెనడా CEO హిమదర్ మద్దిపట్ల గారు, వారి సతీమణి అనిత గారు, ముఖ్య అతిధులుగా Pickering MP జునైటా నాథన్, రీజినల్ కౌన్సిల్ మలీహా షాహిద్ హాజరయ్యారు.హిమదర్ గారు మాట్లాడుతూ ఇండో–కెనడియన్ల అభివృద్ధికి ICICI Bank Canada అండగా నిలుస్తుంది.
అలాగే ICICI బ్యాంకు వివిధ సేవల ద్వారా మన కమ్యూనిటీ కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడతామని, ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న సంస్థని కొనియాడారు. MP జునైటా గారు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (Ontario Telugu Foundation – OTF)సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ వేడుకల నిర్వహణకు చేయూత సాయం సమకూర్చిన – ICICI బ్యాంక్ కెనడా, రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రఘు జూలూరి, రమేష్ గొల్లు, ఆనంద్ పేరిచర్ల), తెలుగు ఫుడ్స్, సుష్మ వరదరాజన్, కల్పేష్ పటేల్, కృష్ణ కుమారి కోటేరు, NCPL రాంబాబు, రవికిరణ్ ఇప్పిలి, శాయంతన్ మహేషన్, డా” సౌజన్య కాసుల, మురళి కృష్ణ రాతేపల్లి, అబ్దేల్ బెనుటాఫ్, భరత్ కుమార్ సత్తి, హైదరాబాద్ హౌస్, మధురం, ఇంద్రప్రస్థ రెస్టారెంట్, ఆహా రెస్టారంట్, ప్రాజెక్ట్ సి, బ్రైట్ బెలూన్స్ ఝాన్సీ, జస్ట్ ఇమ్మిగ్రేషన్, OTF ఫుడ్ పార్టనర్ నవరస ఇండియన్ రెస్టారంట్, భీమాస్, స్వచ్చిఫై, రేడియో భాగస్వామి-మార్నింగ్ రాగ, శ్రీనివాస్ కళ్లెం, కేశవ్ మందాడి, బాలాజీ రాజగోపాల్, ప్రియ లను OTF సమన్వయకర్తలు కలిసి శాలువాలతో సత్కరించి ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మొమెంటోలను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో కెనడా – ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (Ontario Telugu Foundation – OTF)సమన్వయకర్తలు మురళీధర్ పగిడేలా, నివాస్ నారు, శ్రీని ఇజ్జాడ, ప్రవీణ్ నీల, ప్రసాద్ ఘట్టి, చంద్ర చల్లా, దీప-నవీన్ సూదిరెడ్డి, మురళి రెడ్డిచెర్ల, వరలక్ష్మి గంధం, మంజూష చేబ్రోలు, భరత్ వేంకటాద్రి, ఝాన్సీ బదాపురి, మహీధర్ ఆలూరి, కళ్యాణ్ కస్తూరి మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఈ వేడుకల సందర్భంగా స్థానిక వర్తకులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన విక్రేత కేంద్రాలు (Shopping Stalls) కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. కార్యక్రమానికి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా (Raffle) నిర్వహించి 20కి పైగా బహుమతులు (Prizes) ప్రదానం చేయడం జరిగింది.
అయిదుగంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ Ontario Telugu Foundation (OTF)ఫుడ్ పార్టనర్స్ నవరస రెస్టారంట్ సౌజన్యంతో ఉచితంగా రుచికరమైన తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రవీణ్ నీల గారు మాట్లాడుతూ టొరంటో (Toronto, Canada) లో చలి వాతావరణం లో కూడా వెయ్యికి పైగా తెలుగు వారు పాల్గొనడం శ్లాఘనీయమే అంటూ దీపావళి ఆనందం అందరికీ శాంతి, సుసంపన్నతను చేకూర్చాలని ఆకాంక్షించారు. ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న విధంగా దీపావళి వేడుకలు కెనడా టొరంటో ఘనంగా నిర్వహింపబడినవి.