Washington, D.C. : అమెరికా రాజధాని ప్రాంతం కేంద్రంగా భాష, సాంస్కృతిక వారధిగా 50 ఏళ్లుగా కొనసాగుతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) అధ్యక్షులు రవి అడుసుమిల్లి, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో కాన్సర్ సోకిన చిన్నారులకు బహుమతులు అందించారు.
విధి వశాత్తూ చిన్న వయసులోనే అంతులేని విషాదంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు (Cancer Patients) భరోసాగా, కొంతైనా ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరికీ ఒక ఆట వస్తువును గిఫ్ట్ గా అందించారు. వృత్తి, ఉపాధి రీత్యా ఎ దేశంలో ఉన్నా, ప్రజలు సామాజిక బాధ్యతతో, ఒకరికి ఒకరుగా అండగా నిలిచి మానవత్వం చాటుకోవటమే మనందరి కర్తవ్యాన్ని GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) అన్నారు.
చిన్నారులలో ఆత్మ విశ్వాసం పెంచేలా ఈ కార్యక్రమాన్ని పద్మజ బేవర సమన్వయ పరచగా, విజయ్ అట్లూరి, సుశాంత్ మన్నే, శ్రీవిద్య సోమా, భాను మాగులూరి తదిరతులు పాల్గొన్నారు. ఈ ప్రయత్నాన్ని వైద్యులు (Doctors) మరియు సిబ్బంది అభినందించారు..