Nebraska : తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) – నూతన కార్యవర్గం ఆవిష్కరణ సమావేశం విజయవంతంగా నిర్వహణ ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌లో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (Telugu Samithi of Nebraska – TSN) నూతన కార్యవర్గం 2025-2026 ఆవిష్కరణ సమావేశం ఘనంగా జరిగింది.
సమావేశాన్ని జనరల్ సెక్రటరీ శ్రీ తాతా రావు (Tata Rao) గారు ప్రారంభించి, హాజరైన తెలుగు ప్రజలను ఆహ్వానిస్తూ స్వాగత ప్రసంగం అందించారు. అనంతరం TSN అధ్యక్షుడు శ్రీ రాజా కోమటిరెడ్డి గారు గత సంవత్సరం నిర్వహించిన చారిటీ, ఎడ్యుకేషన్ మరియు కల్చరల్ కార్యక్రమాలపై సమగ్ర సమీక్షను వివరించారు.
ట్రెజరర్ శ్రీ సాంబా గారు 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయ వివరాలు మరియు ఈవెంట్ వైజ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ను అద్భుతమైన ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సభ్యులు బైలాస్ సవరణలు, భవిష్యత్తు కమిటీలలో సభ్యత్వ ఆసక్తి, మరియు సమితి అభివృద్ధికి సూచనలు పంచుకున్నారు.
తదుపరి నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి. శ్రీ సుందర్ గారు నూతన అధ్యక్షుడిగా శ్రీ కొల్లి ప్రసాద్ (Kolli Prasad) గారిని ప్రతిపాదించగా, హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఇతర పదవులకూ కొత్త సభ్యులను ఎంపిక చేయడం, కొంతమంది ప్రస్తుత సభ్యులను తదుపరి స్థాయికి ప్రమోట్ చేయడం జరిగింది.
TSN 2025–2026 నూతన కార్యవర్గం
President: శ్రీ కొల్లి ప్రసాద్ గారు
Vice President: శ్రీ తాతా రావు గారు
General Secretary: శ్రీ అలగన్ గారు (కొత్త)
Cultural Secretary: శ్రీమతి రమ్య రవిపాటి గారు
Treasurer: శ్రీ సాంబా డివులా గారు
Joint Treasurer: శ్రీ యుగంధర్ పంగా గారు
EC Members
శ్రీ అనిల్ పోతినేని గారు (Continue)
శ్రీ అవినాష్ గారు (New Member)
శ్రీ ధన గొట్టి పాటి గారు (New Member)
శ్రీ రమేష్ రాయపాటి గారు (Continue)
శ్రీ వీరేంద్ర ముప్పారాజు గారు (Continue)
శ్రీ బాల కమిరెడ్డి గారు (New Member)
Board of Directors
శ్రీమతి లక్ష్మీ మాధురి చిన్నీ గారు (Newly)
శ్రీ వేణు గోపాల్ మురకొండ గారు (Newly)
శ్రీ అనూప్ గారు (Continue)
శ్రీమతి నీలిమ గారు (Lincoln) (Newly)
శ్రీ చైతన్య రవిపాటి గారు (Newly)
సమావేశం ముగింపులో ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ రాజా కోమటిరెడ్డి (Raja Komati Reddy) గారు మరియు నూతన అధ్యక్షుడు శ్రీ కొల్లి ప్రసాద్ (Kolli Prasad) గారు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సమితి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని ఆకాంక్షించారు. గత 15 ఏళ్ల TSN చరిత్రలో ఈ సార్వత్రిక సమావేశంలోనే అత్యధిక హాజరు నమోదైంది.
ఈ కార్యక్రమానికి గత అధ్యక్షులు మరియు ప్రముఖులు సత్యనారాయణ పావులూరి, మురళీధర్ చింతపల్లి, ఫణి అడ్డిదాం, సుందర్ చుక్కరా, సోము కొడాలి, మహేష్ మరియు శరత్ బొడేపూడి, మైనేని కామేశ్వరరావు, శ్రీనివాస్ రావుల, ప్రసాద్ కండిమల్ల, ఆది బాబు, వేణు పొతినేని, నవీన్ కంటం మరియు మరెందరో ఈ కార్యక్రమానికి.విచ్చేసి, కొత్త కమిటీకి ఆశీర్వాదాలు అందించారు.