Leeds, England: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కృపతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) సహకారంతో Leeds Hindu Mandir, Sri Srinivasa Kalyanotsava Samithi (SSKS) మరియు Leeds Andhra Telugu Association (LATA) ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని టీటీడీ (TTD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు సమర్థవంతంగా సమన్వయం చేశారు. స్వామివారి సేవాభావంతో, UK లో ఉన్న భక్తులకు తిరుమల వైభవాన్ని అందించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించారు.
తిరుమల (Tirumala) నుండి వచ్చిన ప్రధాన అర్చకులు శ్రీ రంగనాధ్ (Sri Ranganath) గారు ఆధ్వర్యంలో, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఎదుర్కోలు, కంకణధారణ, వరమాలల మార్పిడి, మంగళ్యధారణ వంటి కళ్యాణ ఘట్టాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ దృశ్యాలు భక్తుల హృదయాలను భక్తిరసంలో ముంచెత్తాయి.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శ్రీ యేకాంత్ , శ్రీ అంబి చాళికి , శ్రీ ఆనంద్ ముఖ్యపాత్ర వహించారు. శ్రీ వారి అంకితభావం, సమన్వయ చాతుర్యం వల్లే ఈ కార్యక్రమం యథాతథంగా సాగింది. భక్తుల సౌకర్యం కోసం ఎన్నో ఏర్పాట్లు సమర్ధవంతంగా నిర్వహించబడ్డాయి.
లీడ్స్ (Leeds) మరియు యూకే (UK) యొక్క ఇతర నగరాల నుండి వచ్చిన ప్రవాసాంధ్రులు (Telugu NRI), తెలుగు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ప్రసాదం, అక్షింతలు పంపిణీ చేయబడ్డాయి.
ఈ సందర్భంగా టీటీడీ (Tirumala Tirupati Devasthanams – TTD) వారు మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా తెలుగు భక్తులకు, భారతీయ సంస్కృతి వెలుగు నింపే లక్ష్యంతో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తున్నాము. భక్తులు స్వామి కృపతో శ్రేయస్సు పొందాలని ఆకాంక్షిస్తున్నాము” అని తెలిపారు.
యూరప్ APANT సమన్వయకర్తగా పనిచేస్తున్న డా. కిషోర్ బాబు చలసాని గారు, శ్రీ వెంకట్ కాట్రగడ్డ గారు, మరియు యునైటెడ్ కింగ్డమ్ APNRT సమన్వయకర్తగా ఉన్న శ్రీ సురేష్ కోరం గారు — అలాగే శ్రీ విజయ్ అడుసుమిల్లి గారు మరియు శ్రీ శ్రీనివాస్ గొగినేని గారు — యూకే మరియు యూరప్ ప్రాంతాలలో నిర్వహించబడుతున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవాలను విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.