Connect with us

Students

Cumming Elementary School విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ – TANA Backpack Project

Published

on

Atlanta, Georgia: ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) అట్లాంటా టీం అధ్వర్యంలొ కమ్మింగ్ ఎలిమెంటరీ స్కూల్ (Cumming Elementary School) విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చెయటం జరిగింది. దాదాపు 100 మంది స్కూల్ విద్యార్ధులకి స్థానిక స్కూల్ అధికారులు మరియు తానా (TANA) ప్రథినిధుల చెతుల మీదగా బాక్ ప్యాక్లూ మరియు స్కూల్ సామాగ్రిని అందించారు.

అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరెన్ కొడాలి (Naren Kodali) మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు (Srinivas Lavu) నాయకత్వంలొ తానా ఈ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తొందని తానా ప్రథినిధుల తెలియచెసారు.

తానా అట్లాంటా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు (Sekhar Kollu) మరియు స్కూల్‌ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ మరియు బ్యాక్ ప్యాక్ కో ఆర్డినేటర్ మహేష్ కొప్పు (Mahesh Koppu) లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెసారు.

ఈ కార్యక్రమంలో తానా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు, తానా అట్లాంటా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు, బోర్డు డైరెక్టర్ భారత్ మద్దినేని (Bharath Maddineni), తానా ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, సోషల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ సోహిని ఐనాల, బ్యాక్ ప్యాక్ కో ఆర్డినేటర్ మహేష్ కొప్పు మరియు తానా సేవకులు రాజేష్ జంపాల (Rajesh Jampala), శ్రీనివాస్ ఉప్పు, కోటేశ్వర రావు కందిమళ్ల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమ్మింగ్ ఎలిమెంటరీ స్కూల్ (Cumming Elementary School) నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా (TANA) కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్‌ ప్యాక్‌ (TANA Backpack Project) కింద తమ స్కూల్‌‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌‌లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.

error: NRI2NRI.COM copyright content is protected