తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్ (Europe) లోని 16 ప్రాంతాల్లో జరగనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో MSME మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారు, APNRT అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరి గారు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచిరాం ప్రసాద్ గారు పాల్గొన్నారు.
వారి వెంట ఎన్ఆర్ఐలు కాట్రగడ్డ కృష్ణప్రసాద్, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, తిట్టు మద్దిపట్ల, కృష్ణ జావాజి, సూర్య వెలగ, నరేష్ కోనేరు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరప్ (Europe) మొత్తం కార్యక్రమాలకు డాక్టర్ చలసాని కిషోర్ బాబు గారు ప్రధాన సమన్వయకర్తగా (All Europe Coordinator) బాధ్యతలు స్వీకరించారు.
యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) మరియు ఐర్లాండ్ (Ireland) ప్రాంతాల సమన్వయకర్తలుగా కాట్రగడ్డ కృష్ణప్రసాద్ గారు, విజయ్‌కుమార్ అడుసుమిల్లి గారు, సురేష్ కోరం గారు, శ్రీను వావిలాల గారు, గోగినేని శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు. శెంగెన్ ప్రాంత సమన్వయకర్తలుగా నరేష్ కోనేరు గారు, శ్రీకాంత్ కుడితిపూడి గారు, సుమంత్ కొర్రపాటి గారు బాధ్యతలు స్వీకరించారు.
ప్రసంగించిన ప్రముఖులు మాట్లాడుతూ – యూరప్ (Europe) లో నివసించే తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేందుకు, సంప్రదాయ సాంస్కృతిక విలువలను చేరవేసేందుకు ఈ కల్యాణాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని శ్రీనివాసుడి (Lord Venkateswara) అనుగ్రహం పొందాలని కోరారు.