Edison, New Jersey, September 9, 2025: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. మరీ వాటిని అధిగమించడానికి సంగీతం కూడా ఒక మార్గమని నిరూపించే కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్ (Edison, New Jersey) లో వారాంతం లో జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఆధ్వర్యంలో జరిగిన ‘మ్యూజిక్ థెరపీ’ (Music Therapy) కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు గ్రహీత, సప్తస్వర సామ్రాట్ స్వర వీణాపాణి విచ్చేసి తన స్వరాలతో అందరిని సమ్మోహితం చేశారు. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మనసును శాంతపరిచే ఒక శక్తిమంతమైన ఔషధం అని స్వర వీణాపాణి పేర్కొన్నారు.
ఆయన (Swara Veenapani) అభివృద్ధి చేసిన ‘స్మార్ట్-సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ’ పద్ధతి ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పద్ధతిలో వివిధ రాగాలను, వాటిలోని తరంగాలను ఉపయోగించి మన మెదడులోని నరాలను ఉత్తేజపరచడం, తద్వారా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను నివారించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
నాట్స్ న్యూజెర్సీ విభాగం (NATS New Jersey Chapter) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై ఆద్యంతం అందరిని అలరించింది. 72 మేళ కర్త రాగాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) సాధించిన పాటను నాట్స్ పూర్వ అధ్యక్షుడు గంగాధర్ దేసు విన్నపం మేరకు వీణాపాణి పాడి వినిపించారు.
అజాత శత్రువు దాము గేదెలకు నాట్స్ సత్కారం
అమెరికాలో పలు తెలుగు సంఘాలకు సేవలందిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంఘ సేవకులు దాము గేదెల (Damu Gedela) ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సత్కరించింది. తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా దాము గేదెల అందించే మద్దతు అపూర్వమని కొనియాడింది.
న్యూజెర్సీ ఎడిసన్ (Edison, New Jersey) లో జరిగిన ఒక కార్యక్రమంలో దాము గేదెలను నాట్స్ సేవా పురస్కారాన్ని అందించి సత్కరించింది. జూలై లో టంపా (Tampa, Florida) వేదికగా జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో దాము గేదెలకు నాట్స్ సేవా పురస్కారాన్ని ప్రకటించారు. ఆనాడు సంబరాల్లో సమయా భావం వల్ల అందించలేని ఆ పురస్కారాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) ఎడిసన్‌లో ప్రత్యేకంగా దాము గేదెలను ఆహ్వానించి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు గంగాధర్ దేసు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (Media) మురళీకృష్ణ మేడిచెర్ల, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా దాము గేదెల (Damu Gedela) అమెరికాలో తెలుగు సంఘాలను, తెలుగువారికి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు.
దాము గేదెల లాంటి సేవా దృక్పథం ఉన్న వారు సాటి తెలుగువారిలో స్ఫూర్తిని నింపుతారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రశంసించారు. ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం లో నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట కీలక పాత్ర పోషించారు.
నాట్స్ న్యూజెర్సీ టీమ్ (NATS New Jersey Chapter) పాస్ట్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళి మేడిచెర్ల, న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు, రామకృష్ణ బోను, జతిన్ కొల్ల, వెంకట చైతన్య మాదాల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, శ్రీదేవి జాగర్లమూడి, ఈశ్వర్ అన్నం, సోమ తదితురులు సహకరించారు.
సాయి దత్త పీఠం (Sai Datta Peetham) డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, శేఖర్ & వల్లీ వేదుల, తెలుగు కళా సమితి (TFAS) అధ్యక్షుడు మధు అన్న మరియు వారి కార్య నిర్వాహక సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.