తెలుగు సినీ రంగానికి చిరస్థాయి కీర్తి తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవం అట్లాంటా (Atlanta, Georgia) లో ఘనంగా జరిగింది. ఈ వేడుకను అట్లాంటా మెగాఫ్యాన్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం బంజారా బ్యాంక్వెట్ హాల్ (Banjara Banquet Hall) లో జరిగిన ఈ ఉత్సవానికి సుమారు 670 మంది అభిమానులు హాజరై, ఆ వేదికను ఒక మెగా జాతరగా మార్చారు.
సాంస్కృతిక జాతర – పాటలు, నృత్యాలు, వినోదం
ఈవెంట్ కర్టెన్ రైజర్ ను శ్రీ కరోతు సురేష్ (Suresh Karothu) గారు ప్రారంభించగా, అంకరింగ్ బాధ్యతలు శ్రీమతి లావణ్య (Anchor Lavanya Guduru) చేపట్టి సాయంత్రాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చిన్నారుల నుండి పెద్దల వరకు పాల్గొన్న డ్యాన్స్ రూపకాలు, మెగా స్టెప్స్ అభిమానుల గుండెలను తాకాయి.
ప్రముఖ గాయకుడు శ్రీ వెంకట్ చెన్నుభొట్ల (Venkat Chennubhotla) గారు తన బృందంతో (శ్రీ దుర్గ గోర, శ్రీమతి రాగవాహిని, శ్రీమతి శిల్ప ఉప్పులూరు) అద్భుతమైన లైవ్ సింగింగ్ తో మెగా వేదికను కుదిపేశారు. DJ Beats & Events వారి మ్యూజిక్ మిక్స్ హాల్ మొత్తాన్ని ఊపేసింది.
ప్రత్యేక ఆకర్షణగా, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) జీవన యాత్రపై రూపొందించిన ప్రత్యేక AV (ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్) ప్రదర్శించబడింది. ఈ AV లో ఆయన సినిమాటిక్ ప్రయాణం, సేవా కార్యక్రమాలు, జాతీయ పురస్కారాలు ప్రతిబింబించగా, హాల్ అంతా కేరింతలతో మార్మోగింది.
LED వాల్ & డెకోర్
ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణ LED వాల్, దానిపై ప్రదర్శించిన మెగా విజువల్స్. దీన్ని ByteGraph అధినేత ప్రశాంత్ కొల్లిపర & మాధురి కొల్లిపర అందించారు. Sparkle Décor అందించిన ఫోటో బూత్ (Photo Booth) అన్ని సమయాలలో కిటకిటలాడుతూ అభిమానులకు గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించింది.
కల్చరల్ హైలైట్స్ – అభిమానుల కేరింతలు
కుమారి ఆర్షి సరగడం గణేష శ్లోకంతో ఆరంభం
చిన్నారులు: అర్జున్ పసుమర్తి, నిమిష పల్లా, మురారి పల్ల, ఆర్షి సరగడం, సుథిక్ష్ రాయల్ కరంగుల, ఇషా కుటల
ద్వారపూడి బ్రదర్స్ (తనీష్, హనీష్) – బాస్ పార్టీ డ్యాన్స్
మహేష్ ద్వారపూడి – చిరు స్టెప్స్
జయని కారుమంచి – చూసా చూశా డ్యాన్స్
పసుపులేటి కిడ్స్, ఎక్కలూరి గ్రూప్ – మాస్ డ్యాన్స్
రాధాకృష్ణ చాట్ల, శ్వేజా కలకుంట్ల – డ్యూయెట్
తరుణ్ కారుమంచి – సోలో
భాను పెర్ని & కీర్తణ కరనం – కపుల్ డ్యాన్స్
చివరగా చిరు తమ్ముళ్లు రఘువీర్ సరగడం, ధీరజ్ కడియాల, కిరణ్ పసుమర్తి, మహేష్ ద్వారపూడి, బద్ర కంటంసెట్టి – మెగా మీటర్‌ను 100% కి పెంచారు. కల్చరల్ పెర్ఫార్మెన్స్ (Cultural Programs) తో ఆహుతులను అలరించిన కళాకారులకు KEDS ICE CREAM వారు గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.
అభిమానులకు రుచుల విందు
ఈవెంట్‌కు విచ్చేసిన అభిమానులకు ఇరాని చాయ్, మిరపకాయ బజ్జీలు, కాజాలు, పిల్లలకు పిజ్జాలు, పెద్దలకు శీతలపానీయాలుతో స్వాగతం పలికారు. డిన్నర్‌లో వెజ్ – నాన్ వెజ్ స్పెషల్ మెనూతో ఒక మెగా బ్లాస్ట్ ఇచ్చారు. PISTA HOUSE, Charcoal N Grill, INDIAN FLAVORS, DOSTHI, MANA VINDU రెస్టారెంట్లు & HOME FOODS (SANJEEV EKKALURI & ESWAR) వడ్డించిన వంటకాలు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.
సుమారు 900 బాక్స్‌లు ప్యాక్ చేసి, సర్వ్ చేయడం జరిగింది. ఈ బాధ్యతను వెంకటపతి రాజు మండపాటి (Raju Mandapati), భోగాది రాఘవ, మహరాణ యడవల్లి, శ్రీనివాస్ పసుపులేటి, గోపి సమ్మెట తదితరులు సమర్థవంతంగా నిర్వహించారు. సాయంత్రం నుండి రాత్రి 11:45 వరకు టీ, స్నాక్స్ & పానీయాల సపోర్ట్ అందించిన మధు కారంగుల ప్రత్యేకంగా మెచ్చుకోదగిన పని చేశారు.
ట్రివియా & రాఫెల్ హైలైట్స్
మెగా ట్రివియాలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందించారు.
రాఫెల్ డ్రాలో విజేతలకు మెగా స్టైల్ గిఫ్టులు
మహిళలకు చీరలు & జాకెట్లు (Drape Stories & Madhura స్పాన్సర్)
పురుషులకు కుర్తా – పైజామాలు (Madhura)
స్పాన్సర్లు & భాగస్వాములు
Venue Sponsor: బంజారా బ్యాంక్వెట్ (వేదిక & సహకారం)
Digital Sponsor: ByteGraph & Sterling Decors
Clothing Sponsor: Drapes Stories & Madhuraa
Food Partners: PISTA HOUSE, Charcoal N Grill, INDIAN FLAVORS, DOSTHI, MANA VINDU రెస్టారెంట్లు & HOME FOODS (SANJEEV EKKALURI & ESWAR)
Photography Sponsor: SV Clicks
Media Partners: Suman TV & NRI2NRI.COM
నిర్వాహకులు & వాలంటీర్ల సేవలు
ఈవెంట్‌ను విజయవంతం చేసినవారు
Organizers: మహరాణ యడవల్లి, నంద కిషోర్, సురేష్ బండారు (Suresh Bandaru)
Cultural Team: ఐశ్వర్య & ప్రియా (క్రమబద్ధ ప్రణాళికతో డ్యాన్స్ షోలు)
Logistics Team: శ్రీ రవి యెలిసెట్టి, శ్రీ అనురాగ్ పలంకి, శ్రీ రవి కిరణ్ కె, శ్రీ చంద్రకాంత్ అకెల్ల, శ్రీ గోపి సమ్మెట, శ్రీ కృష్ణ మేకల, శ్రీ శ్రీ పులకండం, శ్రీ రాజు మండపాటి, శ్రీ భోగాది రాఘవ, శ్రీ సాయి రెగెండ్ల, శ్రీ రాజేష్ తడికమల్ల, శ్రీ నరేష్ తోట, శ్రీ విజేంద్ర బట్టిపాటి,. శ్రీ చిన్మయ మంచల, శ్రీమతి ప్రియాంక గడ్డం, శ్రీ మధు కరంగుల, శ్రీ హెమంత్ పెనుమత్స, గోక్యాడ బ్రదర్స్, శ్రీ సంజీవ్ ఎక్కలూరి, శ్రీ సాయి ప్రవీన్ వర్ధనీడి, శ్రీ హరి తోలేటి, శ్రీ కళ్యాణ్ సుంకర, శ్రీమతి పగ్న్య తూరపాటి, శ్రీ సూర్య బుడిం, శ్రీ శివ చిక్కం, శ్రీ పవన్ ఒగేటి, శ్రీ రాజ్ అద్దంకి & శ్రీ సురేష్ దూలిపూడి.
సమాజానికి చిరు – సేవ & స్ఫూర్తి
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు మూడు దశాబ్దాలకు పైగా సినీరంగంలో వెలుగులు విరజిమ్మడమే కాకుండా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank), నేత్ర దానం కార్యక్రమాలు ద్వారా వేలాది ప్రాణాలను కాపాడారు. అభిమానులు ఈ వేడుకను కేవలం పుట్టినరోజుగా కాకుండా, అన్నయ్య సేవా వారసత్వానికి నివాళిగా జరుపుకోవడం విశేషం.
“హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిరంజీవి గారికి హీరోలే ఫ్యాన్స్” అనే నినాదానికి తగినట్టే, ఈ వేడుక అట్లాంటా (Atlanta, Georgia) చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. శ్రీ సురేష్ బండారు గారు ఓట్ ఆఫ్ థేంక్స్ చెబుతూ అన్నయ్య అంటే అట్లాంటాకు ఉన్న అపూర్యమైన అనుభందాన్ని చక్కగా వివరిస్తూ, స్పాన్సర్స్ అందరికి చిరు జ్ణాపికలు అందించారు.
SV Clicks Photography: https://svclicksphotography.smugmug.com/Boss-Party/Boss-70th-birthday-party/i-kgtP4Lc/A