తెలుగు ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించటానికి ముందుండే తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఇప్పుడు తానా అద్యక్షులు నరెన్ కొడాలి (Naren Kodali) మరియు తానా కొశాధికారి రాజ కసుకుర్తి (Raja Kasukurthi) అద్వర్యంలొ రైతుల కోసం చేపట్టిన ‘రైతు కోసం తానా’ పేరుతో టార్పలిన్స్ (Tarpaulins) మరియు పవర్ స్ప్రేయర్స్ అందిస్తోంది.
రైతు కోసం తానా (Raitu Kosam TANA) కార్యక్రమం పేరుతో కూళ్ళ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ చిట్టూరి వెంకట సూర్యప్రకాశ్ రావు చౌదరి గారు తన 80వ జన్మదిన పురస్కరించుకుని గ్రామంలోని రైతులకు టార్పలిన్స్ బహుకరించారు.
పంటలు తీసుకొచ్చే సమయంలో వచ్చే వానల వల్ల ఇబ్బందులు పడే రైతులకు ఈ టార్పలిన్స్ (Tarpaulins) ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా తానా (TANA) నాయకులను అభినందించారు.
తానా (Telugu Association of North America – TANA) చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు మరిన్ని ఇలాంటి ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఇక్కడికి విచ్చేసిన వారు ఆకాంక్షించారు.