Connect with us

Festivals

శ్రీదేవి పీఠంలో ఆషాఢ మాసం గోరింటాకు సేవ ఘనంగా నిర్వహణ @ Suwanee, Georgia

Published

on

Suwanee, Georgia: తెలుగు సంప్రదాయాలను విదేశాల్లో నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా Aha Events మరియు Happy Family Farms సంయుక్తంగా ఆషాఢ మాసం గోరింటాకు సేవను జూలై 20వ తేదీన సువానీలోని శ్రీలలితాదేవి ఆలయం (Sree Devi Peetham) లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమం ఉచితంగా అందరికి అందుబాటులోకి తీసుకురావడం విశేషం. 75 మంది మహిళలు గొరింటాకు పూయించుకుంటూ ఈ పవిత్ర సేవలో పాల్గొన్నారు. వానపాటలతో, ముచ్చట్లతో, రంగుల చీరలతో ఊరేగిన ఈ వేడుక ఒక ఆధ్యాత్మిక పండుగలా (Festival) సాగింది.

గొరింటాకు మొక్కలు కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబాలతో హాజరైన మహిళలు పెద్దఎత్తున ఈ మొక్కలను స్వీకరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో లలితా అమ్మవారికి (Goddess Lalita) విశిష్ట పూజలు, అలంకారాలతో అభిషేకం నిర్వహించారు.

Aha Events & Happy Family Farms వ్యవస్థాపకురాలు హరికా (Harika) మాట్లాడుతూ, “తెలుగు సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం మా ముఖ్య లక్ష్యం. అశాడమాసంలో గొరింటాకు సేవను ఉచితంగా అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇది మన సంస్కృతికి నివాళిగా భావించాలి” అన్నారు.

అమ్మవారి అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. మహిళలు (Women) తామెరుగని సమయాన్ని కలసి గడుపుతూ, సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ అనుభూతిని పంచుకున్నారు. ఈ విధంగా తెలుగువారి (Telugu) సంప్రదాయాలను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే ఈ విధమైన ఉచిత కార్యక్రమాలు మరిన్ని జరగాలని స్థానికులు ఆకాంక్షించారు.

error: NRI2NRI.COM copyright content is protected