Detroit, Michigan: భాషే బంధానికి మూలమని శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad), తంగిరాల సౌమ్య అన్నారు. అమెరికా లోని డెట్రాయిట్ (Detroit) లో మూడు రోజుల పాటు తానా 24 వ మహాసభలు జరిగాయి. భాను మాగులూరి ఆధ్వర్యంలో పాఠశాల ప్రత్యేక శిబిరాన్ని ఈ మహాసభల్లో ఏర్పాటు చేసారు.
ఈ శిబిరాన్ని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య (Tangirala Soumya), అధికార బాషా సంఘం మాజీ అధ్యక్షులు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad), మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ భాష వారసత్వ సాంస్కృతిక సంపద. ఈ తరానికి, గడచిన తరాలకూ మధ్య భాషే వారధి. సౌమ్య మాట్లాడుతూ మన పిల్లలకు ఏ భాషలో విద్యా భోధన చేసినా వారికి చక్కని తెలుగు నేర్పించాల్సిన భాద్యత ఇక్కడి సమాజంపై ఉంది. అందుకు తానా (TANA) – పాఠశాల ఈ భాద్యతను స్వీకరించి ఉదాత్తంగా పనిచేయటం అభినందనీయం.
అధికార బాషా సంఘం మాజీ అధ్యక్షులు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. భాషను చంపే తరంగా మనం మిగిలి పోకూడదు. ఇక్కడ తెలుగు భాషను, కళలను తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నారు. బాల బాలికలకు తెలుగు పుస్తకాలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి (Jayaram Komati), మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), భక్త భల్ల, సతీష్ చింతా, వెంకట్ కోగంటి, నాగ పంచుమర్తి, సునీల్ దేవరపల్లి, రంజిత్ కోమటి , రావు యలమంచిలి తో పాటు పాఠశాల అధ్యాపకులు గీత మాధవి, రజని, అమృత, శ్రీ రంజిత తదితరులు పాల్గొన్నారు.