“ఇది మన తెలుగు సంబరం.. జరుపుకుందాం కలిసి అందరం” అని ఏ ముహూర్తాన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలకు శ్రీకారం చుట్టారో కానీ.. జులై 4,5,6 తేదీలలో 3 రోజులపాటు అంబరాన్నంటేలా కన్నుల పండుగలా నిర్వహించారు.
ఈ సంబరాల వేదిక మీద నందమూరి బాలక్రిష్ణ చెప్పినట్టు జులై 4న స్వాతి నక్షత్రంలో ప్రారంభించడం, జులై 5న ఆ నరసింహస్వామి అంశలో ఇనాగరల్ ప్రోసెషన్ (Inaugural Procession) తో ఆ దేవదేవుని శ్రీనివాస కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం కూడా ఈ విజయానికి కారణం అయ్యి ఉండొచ్చు.
నాట్స్ కన్వీనర్ & పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) మరియు నాట్స్ ప్రస్తుత బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) శ్రీ కృష్ణార్జునుల వలే చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు. మూడు రోజులకు గానుదాదాపు 20 వేల మందికి పైగా హాజరయ్యారంటే మామూలు విషయం కాదు.
అమెరికా తెలుగు కన్వెన్షన్ల చరిత్రలో మొట్టమొదటిసారి ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోస్ (Nandamuri Balakrishna, Victory Venkatesh, Allu Arjun) ఒక కన్వెన్షన్ కి హాజరవ్వడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వీరికి తోడు మూడు గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ (DSP, Thaman, Chandrabose), టాలీవుడ్ డాన్స్ క్వీన్ శ్రీలీల, యూత్ కి చిట్టి ఫరియాఅబ్దుల్లా ఉండనే ఉన్నారు.
ఇంకా వెటరన్ హీరోయిన్స్ మీనా, జయసుధ, బ్లాక్బస్టర్ దర్శకులు కోవెలమూడి రాఘవేంద్రరావు, సుకుమార్ బండ్రెడ్డి, గోపీచంద్ మలినేని, సూపర్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ప్రముఖ యాంకర్స్ సుమ (Suma Kanakala), శ్రీముఖి, రవి ఇలా చెప్పుకుంటూ పొతే లిస్ట్ చేంతాడంత పొడుగు ఉంటుంది.
ఇప్పటి వరకు నాట్స్ 1.0 అయితే ఇక నుండి నాట్స్ 2.0 అని అంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ కన్వెన్షన్ కి ముందు నాట్స్ వేరు, ఈ కన్వెన్షన్ కి తర్వాత నాట్స్ (NATS) వేరు అంటూ కంపేర్ చేసి మరీ రిఫర్ చేసేలా ఘన విజయం సాధించారు. ఇది ఒక బెంచ్ మార్క్ లాగా నాట్స్ చరిత్రలో ఉండిపోతుంది.
ఈ విజయంలో నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati), ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi), కన్వెన్షన్ కమిటీల సభ్యులు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాత్ర మరువలేనిది. భోజనాల రుచులు అమోఘంగా ఉన్నాయి.
హాస్పిటాలిటీ కి మాత్రం దాసోహం అనాల్సిందే. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.అంతే కాకుండా గత కన్వెన్షన్ లో మాదిరిగా సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ 10% నిధులను వేరే లాభాపేక్షలేని సంస్థలకు ఇచ్చేలా ప్లాన్ చేయడం బహు అభినందనీయం.
గత రెండు సంవత్సరాలలో అమెరికాలోని మరిన్ని నగరాలలో నాట్స్ (NATS) చాఫ్టర్లు ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతున్న తరుణంలో ఈ కన్వెన్షన్ మాసివ్ బూస్ట్ ఇచ్చినట్లయింది. అలాగే చాలా కాలం నుంచి బలంగా ఉన్ననాట్స్ టాంపా చాఫ్టర్ (NATS Tampa Chapter) సభ్యులను కూడా అభినందించాల్సిందే.
ఇక మూడోరోజు కార్యక్రమాల విషయంలోకి వెళితే… ఉదయం నుంచే లోకల్ టాలెంట్ క్లాసికల్, సినీ నృత్యాలు, పాటలు, అన్నమాచార్య కీర్తనలు, గంగాధర శాస్త్రి మరియు తనికెళ్ళ భరణి (Tanikella Bharani) వంటి వారి సాహితీ సమావేశాలు, ఇమ్మిగ్రేషన్ & పిల్లల ప్రోగ్రామ్స్ నడిచాయి.
డే టైం కార్యక్రమాలకు వేరుగా మరో వేదిక ఏర్పాటు చేయడం మంచిదైంది. దీంతో కాన్సర్ట్ సెటప్ కిఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇక సాయంత్రం రాజయకీయ నాయకులు, డోనార్స్, స్పాన్సర్స్, GLOW లీడర్షిప్ ని సత్కరించారు. పలువురు విద్యార్థులకు NATS స్కాలర్షిప్స్ అందించారు.
అలాగే బాలక్రిష్ణ, వెంకటేష్, శ్రీలీల, జయసుధ, మీనా, తనికెళ్ళ భరణి, గోపీచంద్ మలినేని తదితరులను వేదికపై శాలువ, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. శ్రీలీల వేదికపై నాట్స్ (North America Telugu Society – NATS) నాయకులతో సరదాగా కిస్సిక్ సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు.
ఎన్టీఆర్ సెంటెన్నియల్ సెలెబ్రేషన్స్ (NTR Centennial Celebrations) సమయంలో వివిధ దేశాలలో నిర్వహించిన వేడుకలకు సంబంధించి రెండు పుస్తకాలు బాలక్రిష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అశ్విన్ అట్లూరి (Ashwin Atluri), నందమూరి రామక్రిష్ణ (Nandamuri Ramakrishna) ప్రసంగించారు.
అనంతరం పండితుల వేదవచనాలతో నాట్స్ లీడర్షిప్ నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna) కి జీవన సాఫల్య పురస్కారం అందించి, ఘనంగా సత్కరించారు. అలాగే బాలక్రిష్ణ ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute) కి లక్ష డాలర్లు విరాళం అందించారు.
ఇక చివరిగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) లైవ్ కాన్సర్ట్ అందరినీ చిందులేసేలా చేసింది. వరుస బ్లాక్క్బస్టర్ సినిమాలలోని క్లాస్, మాస్ బీట్స్ తో హోరెత్తించారు. బాలక్రిష్ణ సైతం వేదికపై పాట పాడడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. అందరూ వేదిక దగ్గిరకు వచ్చి మరీ కేరింతలు కొట్టారు.
దీంతో అమెరికా కన్వెన్షన్ల చరిత్రలో మొదటిసారి ముగ్గురు టాప్ హీరోస్, 20 వేల మందితో అగ్రగామిగా నాట్స్ కన్వెన్షన్ ఘనంగా ముగిసింది. నెక్స్ట్ కన్వెన్షన్ 2027లో డల్లాస్ (Dallas, Texas) లో కిషోర్ కంచర్ల (Kishore Kancharla) ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ప్రకటించడం విశేషం.