ఉత్తర అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ (North America Telugu Society – NATS) అమెరికా తెలుగు సంబరాలు ఈసారి ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా (Tampa, Florida) వేదికగా జులై 4,5,6 తేదీల్లో జరగనున్న సంగతి అందరికీ విదితమే.
కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి మరియు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి నాయకత్వంలో దాదాపు 200 మంది కన్వెన్షన్ కమిటీల సభ్యులు ఈ కన్వెన్షన్ విజయవంతానికి విస్తృతంగా కృషి చేస్తున్నారు.
కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ కి వ్యక్తిగతంగా మరియు నాట్స్ మాజీ ఛైర్మన్ గా పెద్ద ఎత్తున పరిచయాలు మరియు అనుభవం ఉంది. అలాగే ప్రస్తుత నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) కూడా టాంపా వాసి కావడం మరియు సినీ పరిశ్రమతో పరిచయాలుండడం, నాట్స్ టాంపా చాప్టర్ (NATS Tampa Chapter) ఎప్పటి నుంచో చురుకుగా ఉండడం వంటి పలు కారణాల రీత్యా ఈ కన్వెన్షన్ పై అంచనాలు పెరిగాయి.
అంచనాలను దాటేస్తూ నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna), దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి మహామహులు రానుండడం, తమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ తో రెండు మ్యూజికల్ కాన్సర్ట్స్ ఏర్పాటుచేయడంతో ఈ కన్వెన్షన్ రీచ్ ఆకాశాన్నంటింది.
స్పాన్సర్షిప్, హాస్పిటాలిటీ, పబ్లిసిటీ, రిజిస్ట్రేషన్, డెకొరేషన్, ఫుడ్, యూత్ తదితర కమిటీల సభ్యులు నాట్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శతవిధాలా కష్టపడుతున్నారు. ఎంతలా అంటే.. కన్వెన్షన్ కమిటీల (Convention Committees) సభ్యులే నా బలం మరియు బలగం అని కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ మీడియా ముఖంగా వ్యాఖ్యానించేలా.
ఇంకా శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ… ఈ కమిటీల డైరెక్టర్స్, కోడైరెక్టర్స్, ఛైర్స్, కోఛైర్స్ మరియు సభ్యులు అందరూ మొదటి నుంచి అదే స్పిరిట్ తో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ (Never Before Ever After) అనేలా కన్వెన్షన్ నిర్వహించాలని పట్టుదలగా పనిచేస్తున్నారని, వీరు లేకుండా ఇంత పెద్ద స్కేల్ లో కన్వెన్షన్ సాధ్యం అయ్యేది కాదని అన్నారు.
ఈ రేంజ్ లో ఏర్పాట్లు జరుగుతున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు (NATS Convention) టికెట్స్ ఓపెన్ చేశారు. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా https://sambaralu.org/buynow ని సందర్శించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరుతున్నారు.