దైవ అనుగ్రహంతో, గేట్స్ (Greater Atlanta Telangana Society – GATeS) టీమ్ మరియు వైదేహి ఆశ్రమం యొక్క సమిష్టి సహకారంతో, తల్లితండ్రులులేని బాలికల కోసం “బ్యాక్ హోమ్” (Back Home) సేవా కార్యక్రమాన్ని ప్రేమతో, శ్రద్ధతో నిర్వహించాం.ఈ పుణ్య కార్యం ఒక సాధారణ యాత్ర కాదు – ఇది ఆధ్యాత్మికతతో నిండి ఉన్న సేవా యాత్ర.
మేము ఆ చిన్నారులతో గడిపిన ప్రతి క్షణం, తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయిన వారికి మానవత్వం ఎలా తల్లిలా మారగలదో మాకు స్ఫురణ కలిగించింది.గేట్స్ (GATeS) టీమ్ మరియు శ్రీ నవీన్ ఉజ్జిణీ (Naveen Vujjini) గారు అందించిన ఆర్థిక, మానసిక సహాయం “సేవే మానవతా ధర్మం” అనే గొప్ప సందేశాన్ని ప్రతి హృదయంలో నాటింది.
ఈ దివ్యమైన ప్రయత్నం మరెన్నో హృదయాలను సేవా మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.సర్వే జనాః సుఖినో భవంతుబాలలందరూ క్షేమంగా ఉండాలిమన సేవ మన భక్తిగా మారాలి.