Connect with us

Sports

యువతను ప్రోత్సహిస్తూ TANA Atlanta Chapter బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ @ Fortius Sports Academy, Alpharetta

Published

on

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (Telugu Association of North America – TANA) క్రీడాకారుల కోసం వివిధ రకాల ఆటలపోటీలను (Sports) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 17వ తేదీన తానా అట్లాంటా చాప్టర్ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ (Badminton Tournament) ను నిర్వహించింది.

ఆల్ఫారెటా లోని నూతన ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వివిధ టీమ్‌లు పాల్గొన్నాయి. వివిధ వయస్సు ఉన్న తెలుగు క్రీడాభిమానులు ఇందులో పాల్గొన్నారు. సౌత్‌ ఈస్ట్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మధుకర్‌ యార్లగడ్డ (Madhukar Yarlagadda) ఈ పోటీలను తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి సహకారంతో ఘనంగా నిర్వహించారు.

ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ (Fortius Sports Academy) కి చెందిన ఉదయ్‌, ఎజె అద్భుతమైన క్రీడా వేదికలు మరియు నిర్వహణకు సహకరించారు. చందు టోర్నమెంట్‌ (Badminton Tournament) ప్లానింగ్‌, లక్ష్మి ఈవెంట్‌ ప్రమోషన్‌, శశి తదితరుల సహకారంతో ఈ టోర్నమెంట్‌ విజయవంతమైంది.

తానా (TANA) నాయకులు అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ లావు, భరత్‌ మద్ద్డినేని, వినయ్‌ మద్దినేని, కిరణ్‌ గోగినేని, సోహిని ఐనాల, విజయ్ కొత్త, ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ నుండి సతీష్‌ పునాటి, శ్యామ్‌ మల్లవరపు, విజయ్‌ కొట్ట, విష్ణు వైదన, తామా నుంచి రాఘవ తడవర్తి, సురేష్‌ బండారు, సాయి రామ్‌ కారుమంచి, సునీల్‌ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

వీరితోపాటు తానా (Telugu Association of North America) సభ్యులు మురళి బొడ్డు, సుధాకర్‌ బొడ్డు, భాను గుళ్లపల్లి, అనీల్‌ చిమిలి తదితరులు హాజరుకావడం ఈ కార్యక్రమానికి మరింత జోష్‌ తీసుకువచ్చింది. ఈ పోటీల్లో విజేతలకు ట్రోఫీలను, బహుమతులను అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected