Connect with us

Cultural

ఘనంగా థీమ్ తానా & మదర్స్ డే, సింగర్ సునీత హాజరు, $100K for TANA Convention: Mid-Atlantic Chapter

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం (TANA Mid-Atlantic Chapter) ఆధ్వర్యంలో నిర్వహించిన థీమ్ తానా (DhimTANA) పోటీలు, మదర్స్ డే (Mother’s Day) వేడుకలు విజయవంతంగా జరిగాయి. మే 17వ తేదీన వెస్ట్ చెస్టర్ లోని ఈస్ట్ హైస్కూల్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఫిలడెల్ఫియా, డెలావేర్, హారిస్ బర్గ్ ప్రాంతాల నుండి 300 మందికి పైగా కళాకారులు హాజరై తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

గానం, నృత్యం, అందాల పోటీలతో సహా పలు విభాగాలలో పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 10:00 గంటలకు ప్రారంభమైన పోటీలు రాత్రి 11:00 గంటల వరకు నిరాటంకంగా కొనసాగి, అద్భుతమైన ప్రదర్శనలతో సుమారు 1000 పైగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట (Sunitha Upadrashta) హాజరయ్యారు.

మదర్స్ డే వేడుకలలో భాగంగా, బృందం అనేక నృత్య ప్రదర్శనలు మరియు ఫ్యాషన్ షోలను నిర్వహించింది. సాయంత్రం జరిగిన కార్యక్రమాలలో ‘మమ్మీ అండ్ మీ’ (Mummy and Me) అనే ప్రత్యేక కార్యక్రమం హైలైట్ గా నిలిచింది. దీనిని సునీత వాగ్వల మరియు అపర్ణ వాగ్వల సమర్థవంతంగా సమన్వయం చేశారు.

ప్రముఖులకు సత్కారాలు

ఈ వేడుకల్లో భాగంగా తానా (TANA) మిడ్-అట్లాంటిక్ బృందం తానా పూర్వాధ్యక్షలు, 24వ తానా మహాసభల చైర్మన్ శ్రీ నాదెళ్ల గంగాధర్, తెలుగు టైమ్స్ శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు, శ్రీ రవి మైరెడ్డి, ఇమ్మిగ్రేషన్ అటార్నీ కవిత రామస్వామి, టీవీ 9 ప్రతినిధి ఉజ్వల్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో గాయని సునీత (Singer Sunitha
) ప్రేక్షకులతో ఆత్మీయంగా ముచ్చటించారు, హాజరైన వారితో ఫోటోలు దిగారు, సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

వేడుకలకు వచ్చినవారికి ఇది నిజంగా మరచిపోలేని అనుభూతిని కలిగించింది. ఆమెను తానా వారు ఘనంగా సన్మానించారు. థీమ్ తానా (Dhim-TANA) పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలు, స్పాన్సర్ లు, విక్రేతలు మరియు వాలంటీర్లందరికీ తానా బోర్డ్ సభ్యుడు రవి పొట్లూరి (Ravi Potluri) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తానా మిడ్-అట్లాంటిక్ రీజనల్ ప్రతినిధి వెంకటేశ్వర రావు సింగు, థీమ్ తానా అడ్వైజర్ సతీష్ తుమ్మల ఈ వేడుకల విజయవంతానికి కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమం సమన్వయానికి కృష్ణ నందమూరి, సురేష్ యలమంచి, సరోజ పావులూరి కృషి చేశారు. అద్భుతమైన అలంకరణ వ్యవహరాలను ఫణి కంతేటి చూశారు. స్టాల్ ఏర్పాటు, బూత్ నిర్వాహకుల సమన్వయానికి సురేష్ యలమంచి, ఫణి కంతేటి కృాషి చేశారు.

ఆహార ఏర్పాట్లను సునీల్ కొగంటి, కోటి యాగంటి, రాజు గుండాల పర్యవేక్షించారు. ఈ ఈవెంట్ ను విశ్వనాథ్ కొగంటి ఫోటో వ్యవహారాలను చూడగా, ‘మామీ అండ్ మీ’ కార్యక్రమాన్ని గోపి, సునీత వాగ్వల, యువ వాలంటీర్ల సమన్వయానికి రంజిత్ మామిడి, రిజిస్ట్రేషన్లను కృష్ణ నందమూరి, ఫణి కంతేటి, రవీణ తుమ్మల చూశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్వేత కొమ్మోజి (Swetha Kommoji) వ్యవహరించారు.

వీరితోపాటు వలంటీర్లు నాయుడమ్మ యలవర్తి, మోహన్ మల్ల, చలం పావులూరి, ప్రసాద్ క్రోతపల్లి, మనీషా మేక, భవాని క్రోతపల్లి, రాజేశ్వరి కొడాలి, భవాని మామిడి, రవీణ తుమ్మల, శ్రీనివాస్ అబ్బూరి, రంజిత్ కోమటి, సుబ్బ ముప్పా, శ్రీనివాస్ కోట, రమేష్ గుట్టా, చందు భాసుత్కర్, ప్రసాద్ కస్తూరి మరియు జాన్ ఆల్ఫ్రెడ్, దీప్తి కోకా, రమ్య పావులూరి, అపర్ణ వాగ్వల, కృష్ణిత నందమూరి, వ్యోమ్ క్రోతపల్లి, ధీరజ్ యలమంచి, లౌక్య పావులూరి, మన్విత యాగంటి కార్యక్రమ విజయవంతానికి కృషి చేసారు.

ఈ కార్యక్రమానికి రవి పొట్లూరి, రాజా కసుకుర్తి (Raja Kasukurthi), వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు, ఫణి కంతేటి, సుబ్రహ్మణ్యం ఓసూరు, సురేష్ బొందుగుల మొదలైనవారు దాతలుగా వ్యవహరించారు. నమస్తే ఇండియా రెస్టారెంట్ ఈ కార్యక్రమానికి పసందైన విందును అందించింది. ఈ కార్యక్రమానికి పలువురు తానా నాయకులు హాజరయ్యారు.

24వ తానా మహాసభల చైర్మన్ నాదెళ్ల గంగాధర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్ర, కాన్ఫరెన్స్ సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల ఈ కార్యక్రమంలో పాల్గొని సత్కరించబడ్డారు. గంగాధర్ నాదెళ్ల రాబోయే మహాసభల గురించి సమాచారం పంచుకున్నారు మరియు డెట్రాయిట్ (Detroit, Michigan) లో జరగనున్న 24వ తానా మహాసభకు అందరినీ ఆహ్వానించారు.

తానా (TANA) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి (Naren Kodali), బోర్డు డైరెక్టర్ రవి పోట్లూరి, కార్యదర్శి రాజా కసుకుర్తి, మిడ్ అట్లాంటిక్ ఆర్ వీ పి వెంకటేశ్వర రావు సింగు, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఒరుగంటి, టీమ్ స్క్వేర్ చైర్ కిరణ్ కొత్తపల్లి, మిడ్-అట్లాంటిక్ తానా పూర్వ రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కొగంటి, సతీష్ చుండ్రు, తానా న్యూ ఇంగ్లాండ్ ఆర్ వీ పి కృష్ణ ప్రసాద్ సొంపల్లి, 24వ మహాసభ యూత్ కమిటీ చైర్ విశాల్ బెజవాడ, మరియు సతీష్ మేక తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

24వ తానా మహాసభలకు (TANA Convention) తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ లక్ష అమెరికన్ డాలర్స్ ప్రకటించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తానా మిడ్-అట్లాంటిక్ బృందం (TANA Mid-Atlantic Chapter) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

error: NRI2NRI.COM copyright content is protected