Connect with us

Movies

మే 22 నుంచి AHA OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవ్వనున్న The Devil’s Chair సినిమా

Published

on

అదిరే అభి (Adire Abhi) మరియు అట్లాంటా వాసులు వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి నటించిన ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమా గత ఫిబ్రవరిలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్రర్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకులు గంగాధర్ సప్తశిఖర (Gangadhar Sapthasikhara) ఈ సినిమాని తీర్చిదిద్దారు.

ఇప్పుడు మే 22న ఆహా (AHA) OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవ్వడానికి ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) మూవీ సిద్ధంగా ఉంది. విలన్ పెడుతున్న ఇబ్బందులను సాల్వ్ చేస్తూ దాదాపు 40 నిమిషాల నిడివితో కూడిన ప్రొఫెసర్, మెంటలిస్ట్ మనోజవా పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) నటించి మెప్పించారు.

అలాగే రక్తం చూడగానే తన ఆత్మ వివిధ మనుషుల్లోకి వెళ్లడం, వారిని ఇబ్బంది పెట్టడం వంటి మెయిన్ విలన్ పాత్రలో చంద్ర సుబ్బగారి (Chandrasekhar Reddy Subbagari) నటించారు. ఇంకా ఈ సినిమాలో ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ నవీన్ (Jabardasth Naveen), స్వాతి మందల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అందరూ మే 22 నుంచి ఆహా (AHA) ప్లాట్ఫామ్ లో చూడాల్సిందిగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ పలువురు ప్రముఖ కమెడియన్స్ వీడియో రిలీజ్ చేశారు. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సిఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కెకె చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి ఈ సినిమాని నిర్మించారు.

error: NRI2NRI.COM copyright content is protected