Connect with us

Events

Naperville, Chicago: Whalon సరస్సు ఒడ్డున చికాగో ఆంధ్ర సంఘం మాతృదినోత్సవ వేడుకలు

Published

on

Chicago, Illinois: నిస్వార్థమైన, నిరంతరమైన తల్లి ప్రేమకు, ఏమి ఇచ్చినా, ఏమి చేసినా ఋణం తీర్చుకోలేం.అలా ఏమి ఆశించకుండా, ప్రతినిత్యం తన బిడ్డల కోసం తపనపడుతూ, ఏ త్యాగానికీ వెనుకాడని మాతృమూర్తులకు (Mother Goddesses) మరి 10 జన్మలు ఎత్తి సేవ చేసినా ఋణం తీర్చుకోలేం. అలాంటి మాతృమూర్తులను, మాతృ ప్రేమను  గౌరవించే ఉద్దేశంతో ప్రారంభించిన మాతృ దినోత్సవ వేడుకలను, చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వారు ఒక వినూత్నమైన పద్ధతిలో నిర్వహించారు.

మే 11న, Naperville లోని Whalon సరస్సు ఒడ్డున, ఆహ్లాదకరమైన వాతావరణంలో చికాగో ఆంధ్ర సంఘం వారి మాతృదినోత్సవ వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి. చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) 2025 అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి (Sri Krishna Matukumalli), చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu), ఉపాధ్యక్షులు తమిస్రా కొంచాడ (Tamishra Konchada) గారి స్వాగతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి చికాగో (Chicago) పరిసర ప్రాంతాల నుండి 200 మందికి పైగా మాతృమూర్తులు, వారి కుటుంబ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సౌమ్య బోజ్జ (Soumya Bojja) గారు (Mrs. Bharath Illinois 2025) నిర్వహించిన Zumba డాన్స్‌, ఆహ్వానితులను ఉర్రూతలూగించగా, కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులందరూ చిన్న – పెద్ద, ఆడ – మగ, అనే తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొని సౌమ్య (Soumya) గారితో పాటు తాము కూడా కాలు కదిపారు.

తదనంతరం నిర్వహించిన 5K పరుగు పందెంలో, వయస్సుతో సంబంధం లేకుండా వచ్చిన వారు అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.  బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో, వివిధ విభాగాల్లో విజేతలైన వారిని, CAA (Chicago Andhra Association) ధర్మకర్తలు, ఇతర కార్యవర్గ సభ్యులు మెడల్స్‌తో సత్కరించారు.

సంస్థ యువ కార్యావర్గ సభ్యులు శ్రీయ కొంచాడ (Sriya Konchada), మయూఖ రెడ్డి (Mayukh Reddy) వారి  గులాబీ పూలతో తయారు చేసిన పుష్ప గుచ్చాలను అందముగా అలంకరించగా, తర్వాత, కార్యక్రమానికి వచ్చిన మాతృ మూర్తులకు  వారి వారి కుటుంబ సభ్యులతో ఈ పుష్ప గుచ్చాలను అందించి తదనంతరము అందరితో మదర్స్ డే (Mother’s Day) కేక్ కట్ చేయించారు. ఈ వేడుక అంతా  శివ పసుమర్తి (Shiva Pasumarthi) గారు వాక్యత గ వ్యవహరించి  తనదైన శైలి లో అందరిని అలరించారు.

మురళీ రెడ్డి (Murali Reddy) వారి నేతృత్వంలోని బృందం, కార్యక్రమానికి విచ్చేసినవారికి అల్పాహారం సమకూర్చారు. హేమంత్ తలపనేని (Hemanth Talapaneni), చందు గంపాల (Chandu Gampala), లోహిత గంపాల (Lohitha Gampala), వచ్చిన ఆహ్వానితులను వయస్సుల వారిగా నమోదు చేసుకుని పరుగు పందెం  కోసం కావలసిన సంఖ్యలను కేటాయించారు.

సంస్థ కార్యావర్గ సభ్యులు నరసింహ రెడ్డి గారు, సాహితీ కొత్త గారు, శృతి కుచంపుడి  గారు, శైలజ సప్ప గారు, గిరి రావు గారు, రామ రావు కొత్తమాసు గారు, వీరపనేని నరసింహారావు గారు మరియు సంస్థ పూర్వాధ్యక్షులు శైలేష్ మద్ది , మాలతీ పద్మాకర్ , శ్వేతా కొత్తపల్లి గారు వారి వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యకర్మములో వివిధ విభాగాలలో పాల్గొని వారి సహకారముతో విజయానికి ఎంతో సహకరించారు.  

సునీత రాచపల్లి, అనురాధ గంపాల ఆధ్వర్యం లో హరిణి మేడ, ఉమా కొత్తమసు సహాయంతో చికాగో  ఆంధ్ర ఫౌండేషన్ (CAF), ద్వారా  నడిచే వివిధ సేవాకార్యక్రమాల కోసం నిధులు స్వీకరించే ఉద్దేశంతో, కూరగాయ మొక్కలను, నోరూరించే వివిధ రకాల పచ్చళ్ళను విక్రయించి, వచ్చిన విరాళాలను CAF ఖాతాలో జమ చేశారు.

ఈ కార్యక్రమం అంతటా BOD టీమ్‌కి అండగా నిలిచినందుకు ట్రస్టీలు ఉమా కటికి (Uma Katiki), దినకర్ కారుమూరి (Dinkar Karumuri), ప్రసాద్ (Prasad) మరియు భార్గవి నెట్టెం (Bhargavi Nettem), మరియు సుజాత అప్పలనేని (Sujatha Appalaneni) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ కార్యక్రమానికి సంస్థ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu), 2025 ఉపాధ్యక్షులు తమిస్రా కొంచాడ, ఇతర కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు విరివిగా పాల్గొని, కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సహాయ సహకారాలను, తోడ్పాటును  అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected