Connect with us

Convention

సందడిగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కన్వెన్షన్ వాలంటీర్స్ అప్ప్రీసియేషన్ @ Phoenix, Arizona

Published

on

Arizona, Phoenix: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొట్టమొదటి నేషనల్ కన్వెన్షన్ (Convention) గత మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం, ఫిలడెల్ఫియా నగరంలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో అత్యంత ఘనంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ విజయానికి కారకులైన వాలంటీర్స్ ని అభినందిస్తూ ఆరిజోనా లోని ఫీనిక్స్ లో సక్సెస్ పార్టీ నిర్వహించారు. AAA ఫీనిక్స్ చాప్టర్ కి చెందిన కోర్ టీం, సభ్యులు, మహిళలు, చిన్నారులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేఖ రమ్య మరియు అలేఖ్య హరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ముందుగా వ్యాఖ్యాతలు అందరికీ సాదర స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి మెమెంటోలు అందజేశారు. అందరూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింభించేలా కన్వెన్షన్ నిర్వహించారంటూ కొనియాడారు.

దాదాపు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫౌండర్ హరి మోటుపల్లి (Hari Motupalli) సారధ్యంలో AAA నాయకులందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఈ కన్వెన్షన్ విజయవంతమైనదని అన్నారు. ఒక పండుగలా రెండు రోజుల కన్వెన్షన్ ని నిర్వహించారన్నారు.

ఆంధ్ర వైభవాన్ని చాటేలా కల్చర్ ఎట్ కోర్ (Culture at Core) అంటూ బాంక్వెట్ డిన్నర్ నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ కాన్సర్ట్స్ (Concerts), శ్రీ శ్రీనివాస కళ్యాణం, తెలుగు సినీ నటీనటుల కోలాహలం, హాస్పిటాలిటీ, భోజనాలు, వంటి హైలైట్స్ తో అలరించారన్నారు.

మహిళలు, చిన్నారులు కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. గత వారాంతం నిర్వహించిన ఈ వాలంటీర్స్ అప్ప్రీసియేషన్ (Volunteers Appreciation) కార్యక్రమంలో అందరూ ఉల్లాసంగా గడిపారు. ముందు ముందు AAA కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు.

శ్యామ్ బైరా (IACRF Director), లలిత బైరా (Phoenix Women’s Commissioner), ప్రవీణ్ సామల (TTA Board of Director), చెన్నారెడ్డి శనికొమ్ము (Arizona Telangana Association), డా. రూపేష్ కాంతాల, లక్ష్మీకాంత్ పందిరి, అవినాష్ రెడ్డి మరియు జో దొడాని ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్ఛేశారు.

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) Phoenix Chapter Core Team సభ్యులు కళ్యాణ్ గొట్టిపాటి, నాగ జాలప్పగారి, శిరీష కంకణాల, రమ్య ఇంద్రకంటి, చంద్రబాబు పృథ్వి, హరి ప్రకాష్ గిజుపల్లి, పవన్ కోట, మధు అన్నే మరియు కృష్ణంరాజు గొండు కార్యక్రమ నిర్వహణలో ముఖ్యపాత్ర వహించారు.

కిడ్స్ యాక్టివిటీస్, గేమ్స్, ఓపెన్ డీజే తో అందరూ వారాంతాన్ని ఉత్సాహంగా గడిపారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association) కార్యక్రమాలలో మళ్ళీ కలుద్దాం అంటూ విజయవంతంగా AAA కన్వెన్షన్ వాలంటీర్స్ అప్ప్రీసియేషన్ కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected