Dublin, Ireland: శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ (Ireland) వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయం నందు నిర్వహించారు.
కార్యక్రమంలో ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్ (Shivakumar), మాధవి (Madhavi) దంపతుల సహకారంతో నిర్వహించారు. పిమ్మట విద్యనాథ్ రజిత (Vidyanath Rajitha) మరియు కళ్యాణ్ ఇనిస్ (Kalyan Innis) దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు.
పిమ్మట శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, హిందూ ధర్మంలో గోమాత పూజ ఏంతో విశేషమైన క్రతువు అందుచేత అమ్మవారి జన్మదినోత్సవం నాడు ఇక్కడ పవన్ కుమార్ గారి సహకారంతో శాస్రోక్తంగా గోపూజలు నిర్వహించారు.
తరువాత కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు. శ్రీనివాస్ (Srinivas), సరిత మరియు సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు. తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ (Pinaka Sharma) గారు ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక మొదలగు వారి ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్ (Destiny Ireland), టీం దుకాణ్, తాలి రెస్టారెంట్ (Thali Restaurant), ఇండియన్ వైబ్ రెస్టారెంట్ (Indian Vibe Restaurant), TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని మరియు శ్రీమతి మౌనిక గార్లు నడిపించారు.
చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య (Annamacharya) కీర్తనలు, అమ్మవారి పాటలు మరియు నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ గారు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు. చివరిగా అపూర్వ చారిటీ (Apurva Charity) సంస్థ తరుపున ప్రవీణ్ గారు నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం (Hindu temple) గురించి మరియు అందులో వాసవి (Vasavi) అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పారు.
జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ (Narendra Kumar) గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారిలో మొదటగా సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లు పాల్గొని విజయవంతంగ ముగించారు.