Connect with us

Events

ATA Houston Chapter ఆధ్వర్యంలో స్థానిక అష్టలక్ష్మి గుడిలో ఘనంగా Mother’s Day సెలబ్రేషన్స్

Published

on

Houston, Texas: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (ATA) అద్వర్యంలో హౌస్టన్ (Houston) మహానగరంలోని అష్టలక్ష్మి గుడి (Ashtalakshmi Temple) లో మదర్స్ డే (Mother’s Day) సెలెబ్రేషన్స్ మే 4 వ తారీఖున నిర్వహించారు.

250 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల (Jayanth Challa), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికొప్పులా (Narsi Reddy Gaddikoppula), జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి (Sharada Singireddy) పాల్గొన్నారు.

కొత్త గా ఏర్పడ్డ ఆటా హౌస్టన్ టీం (ATA Houston Team) మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు అందరు తమ మాతృమూర్తులతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని సందర్శించుకున్నారు.

ముఖ్య అతిధులుగా జడ్జి ట్రిసియా క్రేనేక్ (Judge Tricia Krenek), జడ్జి ఎడ్వర్డ్ ఎం. క్రేనేక్ (Judge Edward Krenek), Dr. కల్పలత గుంటుపల్లి (Dr. Kalpalatha Guntupalli), Dr. రేణు తమిరిస (Dr. Renu Thamirisa), Dr. రత్నకుమార్ (Dr. Ratnakumar), ఆశ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆటా హౌస్టన్ (ATA Houston Chapter) ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీధర్ కంచనకుంట్ల (Sridhar Kanchanakuntla), రామ్ మట్టపల్లి (Ram Mattapalli) కార్యక్రమం పర్యవేక్షించారు.

బంగారు రెడ్డి ఆలూరి (Bangaru Reddy Aluri), జె.పి. ముదిరెడ్డి జగపతి వీరతి (J.P. Mudireddy Jagapathi Veerathi), దయాకర్ ధవళాపూర్ (Dayakar Dhavalapur), వెంకట్ రమణ రెడ్డి ఎరువు, వెంకట్ గార్లపాటి తదితరులు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected