Cumming, Georgia: సిలికానాంధ్ర మనబడి అట్లాంటా శాఖ వారు DeSana Middle school లో గాయత్రి గాడేపల్లి (Gayathri Gadepalli) (Location 1 – Alpharetta, Dunwoody, Riverdale) మరియు Vickery Creek Middle School లో మెహెర్ వేమరాజు (Meher Vemaraju) (Location 2 – Cumming 1, Cumming 2, Marietta) గారి ఆద్వర్యం లో ఏప్రిల్ 12, 2025 న తెలుగు మాట్లాట పోటీలు నిర్వహించారు.
తెలుగు మాట్లాట అనే సిలికానాంధ్ర (Silicon Andhra) మనబడి కార్యక్రమo తెలుగు భాషా మలుపులతో, ఉత్తేజకరమైన ఆహ్లాదకరమైన జనాదారణ పొందిన ఆటల ద్వారా, వారి స్నేహపూర్వక పోటీస్పూర్తిని రేకెత్తించడం ద్వారా, పిల్లలలో తెలుగు భాషపై ఆసక్తి మరియూ ప్రేమను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పలుకే బంగారం అన్న ఆర్యోక్తి ప్రకారం జార్జియా (Georgia) ప్రవాస భారతీయులైన ఎంతోమంది పిల్లలు తెలుగు నేర్చుకోవాలనే ఆరాటంతో, భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనే అభిలాషతో సిలికానాంధ్ర మాట్లాట పోటీలలో పాల్గొన్నారు. 200 మంది, (5-16 ) సంవత్సరాలు లోపు తెలుగు పిల్లలు పదరంగం, తిరకాటం, ఓనిమ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ముగ్దుల్ని చేసారు.
బుడి బుడి నడకల బుడతలు తప్పటడుగులు వేస్తూ, సిసింద్రీలు పదరంగంలో ముందుకు సాగుతూ, అందరిని తిరకాటంలో పడేస్తూ, చివరకు ఇరువురు మాత్రము గెలిచిన ఘనులు. సిసింద్రీలు అటు – ఇటు పరుగెత్తుతూ, ఒనిమా లో తికమక పడుతూ, తిరకాటంలో అంకెలగాలం లో చిక్కి ముగ్థుల్ని చేసారు.
చిరుతలు పదరంగం, తిరకాటం, ఒనిమా పోటీల్లో ముందుకు దూసుకు పోతూ పదరంగంలో అద్బుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ అతివేగంగా చిరుతల్లా తమ సత్తాను చాటారు. తామా (Telugu Association of Metro Atlanta – TAMA) వారి సౌజన్యంతో, సిలికానాంధ్ర జార్జియా పురోగతి కార్యదర్శి విజయ్ రావెళ్ళ (Vijay Ravilla) గారి సహకారంతో April 12, 2025 వ రోజున జార్జియా రీజియన్-1 వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించారు.
అలాగే జార్జియా రీజియన్-2 వారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ రకాల వయోపరిమితి లతో సిలికానాంధ్ర (Silicon Andhra) వారి “మాట్లాట” పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, దిగ్విజయంగా, నిరాటంకంగా కొనసాగాయి. అలాగే పిల్లలకు తల్లితండ్రులకు అభినందనలు తెలుపుతూ TAMA వారు సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందచేశారు.
ఈ మాట్లాట ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి దోహదమైన ప్రధాన కార్యకర్తలు – మృదుల మునుకుట్ల (Mrudula Munukutla) గారు, సుక్రాత్ మహాజన్ (Sukrath Mahajan) గారు, నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) గారు, సుచేత కాంచనపల్లి (Sucheta Kanchanapalli) గారు, యశ్వంత్ జొన్నలగడ్డ (Yashwanth Jonnalagadda) గారు, గౌరీధర్ మాడు (Gauridhar Madu) గార్లని అందరూ విశేషంగా అభినందించారు.
న్యాయనిర్ణేతలుగా సేవలందించిన జి. శిరీష గారు, శ్రీనివాస రామనాధం గారు, శ్రీ దివ్య కునుపరెడ్డి గారు, వాణి సంతోషి గారు, సువర్ణ అడెపు గారు, సాంబ మొక్కపాటి గారు, అను రాంశెట్టి గారు, సంధ్య రావూరి గారు, విజయలక్ష్మి పూసపాటి గారు, సత్య గారు, లావణ్య తమిరిషా గారు, గౌతమ్ చల్లా గారు, సుధా భగనగరపు గారు, ఐశ్వర్య గుండబోలు గారు, బాలా జిట్టా గారు, దీపక్ గౌరిశెట్టి గారు, వేణు హరి గారు, రఘు తుల్లిమిల్లి గారు, సుధా భీమవరపు గారు, శ్రీ దివ్య వీర్ల గారు, సారిక గారు, మంజూష గార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతఙ్ఞతలు.
ఈ తెలుగు మాటలపండుగకు తమ వంతు సహాయం చేసిన తల్లితండ్రి స్వచ్చంద సేవకులు ఉషా శివకోటి గారు, గీత ఇసుకపల్లి గారు, హరికృష్ణ తల్లం గారు, అనూష చల్లా గారు, ప్రవీణ్ కాశీభట్ట గారు, సురేష్ వాయుగుండ్ల గారు, ఉమా బొద్దులూరి గారు, రాకేష్ గారు, సతీష్ గార్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలుపుకున్నారు.
ఈ పోటీలలో దాదాపు 200 మందిపాల్గొనగా, విజేతలుగా ఎంపిక అయిన వారి వివరములు.
GA Region 1 -అల్ఫారెట్టా – డన్వుడి – రివర్డేల్
బుడతలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: వైష్ణవి యమన
ద్వితీయ స్థానం రన్నరప్: మీనంకిత్ నారాయణ సంక
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: సైష్ మగపు
ద్వితీయ స్థానం రన్నరప్: వృషాంక్ పశుపతి
సిసింద్రీలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: ఆద్య కలవ
ద్వితీయ స్థానం రన్నరప్: మేఘ కనపర్తి
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: ఇప్సితా కళ్యాణ్
ద్వితీయ స్థానం రన్నరప్: అద్వితీయ కేశనశెట్టి
పదరంగం
ప్రథమ స్థానం విజేత: సత్య ఈశాన చరిత్ కాశీభట్ట
ద్వితీయ స్థానం రన్నరప్: అద్వితీయ కేశనశెట్టి
చిరుతలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: శ్రీ కార్తీక సరెడ్డి
ద్వితీయ స్థానం రన్నరప్: గోపీ కృష్ణ యర్రా
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: శ్రీ కార్తీక సరెడ్డి
ద్వితీయ స్థానం రన్నరప్: కౌశల్ అవంచ
పదరంగం
ప్రథమ స్థానం విజేత: శ్రీ కార్తీక సరెడ్డి
ద్వితీయ స్థానం రన్నరప్:గోపీ కృష్ణ యర్రా
GA Region 2 – కమ్మింగ్ 1 & 2 – మేరియట్టా
బుడతలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: శ్రీకా జుజ్జువరపు
ద్వితీయ స్థానం రన్నరప్: షణ్ముకేష్ మేడ
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: అశ్విన్ బండేపల్లి
ద్వితీయ స్థానం రన్నరప్: షణ్ముకేష్ మేడ
సిసింద్రీలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: సాయిసాత్విక్ కొప్పుల
ద్వితీయ స్థానం రన్నరప్: విహాన్ జుజ్జవరపు
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: అభిరామ్ గరికపాటి
ద్వితీయ స్థానం రన్నరప్: హర్షిత కనకం
పదరంగం
ప్రథమ స్థానం విజేత: సాయిసాత్విక్ కొప్పుల
ద్వితీయ స్థానం రన్నరప్: ఆరాధ్య అల్లాడి
చిరుతలు
ఒనిమ
ప్రథమ స్థానం విజేత: సంహిత కొప్పుల
ద్వితీయ స్థానం రన్నరప్: పురంధర్ రామ్ చోప్పా
తిరకాటం
ప్రథమ స్థానం విజేత: సంహిత కొప్పుల
ద్వితీయ స్థానం రన్నరప్: అన్విత్ చాడా
పదరంగం
ప్రథమ స్థానం విజేత: ఆరవ్ గౌరిశెట్టి
ద్వితీయ స్థానం రన్నరప్: సంహిత కొప్పుల
ఈ విజేతలందరు August 30th మరియు 31st, 2025 న Chicago, IL లో నిర్వహించబడే మాట్లాట అంతర్జాతీయ పోటీలలో పాల్గొనుటకు అర్హత సంపాదించారు. వీరందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాము.
తిరకాటం: వివిధ అంసాలా పై తెలుగు భాష లో ప్రస్నోత్తరాలతో కూడిన క్విజ్ గేమ్.
పదరంగం: ఈ ఆటలో ఆటగాళ్లు ముందుగా రికార్డు చేసిన పదాన్ని విని బోర్డు ఫై తెలుగు లో రాయాల్సి ఉంటుంది.
ఒ.ని.మ: ఈ ఆటలో ఆటగాళ్లు ఒక అంశం ఫై ప్రత్యేకంగా తెలుగు లో ఒక నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది.
ఇలా ఈ ఆట పరిచయంతో, పిల్లలందరు ముందుకు వచ్చి తెలుగు మాట్లాటలో ఆడటానికి రిజిస్టర్ చేసుకోవాలి అని ఆసిస్తూ, మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము అని తెలియచేస్తూ, తెలుగు నేర్చుకోడానికి ఇది ఒక సరదా మార్గం అని భావిస్తూ, భాష సేవయే భావి తరాల సేవగా, పలుకే బంగారం పదమే సింగారం అంటూ సెలవా మరి.