Edison, New Jersey: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam – Jammu and Kashmir) లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతిగా, ఏప్రిల్ 24, 2025న సాయంత్రం 8:00 గంటలకు శ్రీ శివ విష్ణు ఆలయం, ఎడిసన్‌లోని మేయిన్ ప్రార్థనా మందిరంలో సాయి దత్త పీఠం (Sai Datta Peetham) ఆధ్వర్యంలో స్మృతిసభ ఘనంగా నిర్వహించబడింది.
ఈ స్మృతిసభ (Condolence Meeting) కార్యక్రమంలో వివిధ సంఘాల (Associations) నాయకులు, కుటుంబ సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని, దుఃఖ సమయంలో ఏకతా, మానవత్వం, మరియు మద్దతు అనే విలువలకు సమ్మిళితమైన ఆదరణను వ్యక్తం చేశారు.
ఉగ్రదాడిలో మరణించినవారికి ప్రార్థనలు అర్పించి, వారి కుటుంబాలకు మానసిక బలాన్ని అందించాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం (Condolence Meeting) జరిగింది. ఈ సందర్భంగా పలువురు కమ్యూనిటీ లీడర్స్ (Community Leaders) మాట్లాడారు.
“ఈ బాధాకర సంఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. మనమందరం కలసి ఉన్నప్పుడే ఈ విధమైన సంఘటనలపై స్పందన సరైన దిశలో కొనసాగుతుంది. ఈ స్మృతిసభ మానవత్వానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ప్రార్థనలు (Prayers), మౌనంగా నివాళి (Tribute) మరియు సంఘ నాయకుల నుంచి సందేశాలు వెలువడ్డాయి. ఈ స్మరణ సమర్పణ (Condolence Meeting) ద్వారా ప్రజలంతా మానవత్వం, శాంతి మరియు ఏకత్వాన్ని పునరుద్ఘాటించారు.