Connect with us

Politics

ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో గుడివాడ ఎమ్మెల్యే అతిథిగా CBN Diamond Jubilee పుట్టినరోజు వేడుకలు @ Atlanta, Georgia

Published

on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) 75వ వసంతం లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని డైమండ్ జూబ్లీ (Diamond Jubilee) పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగరంలో ఘనంగా నిర్వహించారు.

ఏప్రిల్ 20 ఆదివారం రోజున కమ్మింగ్ (Cumming, Georgia) లోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల (Ramu Venigandla) ముఖ్య అతిథిగా విచ్ఛేశారు.

సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే రాము వెనిగండ్ల మరియు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వెంకీ గద్దె తెలుగుదేశం పార్టీ అధినేత, రాజనీతిజ్ఞుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి డైమండ్ జూబ్లీ (Diamond Jubilee) పుట్టినరోజు వేడుకలకు విచ్ఛేసిన అందరికీ స్వాగతం పలికి, స్థానిక తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రవి పోణంగి, మల్లిక్ మేదరమెట్ల, కోటేశ్వరరావు కందిమళ్ల, రామక్రిష్ణ, మధుకర్ యార్లగడ్డ తదితరులు ప్రవాసులనుద్దేశించి ప్రసంగించారు. దేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన సేవల్ని అందరూ కొనియాడారు.

తదనంతరం ముఖ్య అతిథి, గుడివాడ (Gudivada) శాసనసభ్యులు రాము వెనిగండ్ల (Ramu Venigandla) సభికులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తలరాతను మార్చే నేత చంద్రబాబు అని, ప్రపంచం అంతా ఈరోజు, రేపటి గురించి ఆలోచిస్తే చంద్రబాబు మాత్రం రేపటి తరం గురించి ఆలోచిస్తారని అన్నారు.

అలాగే ప్రపంచంలో రెండు ప్రధాన నగరాలను అభివృధ్హి చేసిన, చేస్తున్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు (Nara Chandrababu Naidu – NCBN) అని, ఎన్టీఆర్ ని దేవుడిలా ఎలా పూజిస్తానో అంతకంటే ఎక్కువగా చంద్రబాబుని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తానని అనడంతో వేదికప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.

అందరి సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేశారు. హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు, జై సీబీఎన్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అందరూ నినాదాలు చేశారు. అన్న ఎన్టీఆర్ (NTR) విగ్రహం వద్ద రాము వెనిగండ్ల తో పలువురు ఫోటోలు దిగారు.

వేదిక ప్రాంగణాన్ని నారా లోకేష్ (Nara Lokesh), నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కటౌట్లు, జండాలతో అలంకరించడం బాగుంది. వందన సమర్పణ అనంతరం చివరిగా తేనీటితో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected