Houston, Texas: ప్రతి సంవత్సరం లాగే అందరి సహకారంతో నిన్న (04-19-2025) ట్యాగ్ (TAGH – Telangana Association of Greater Houston) ఆధ్వర్యంలో జోన్స్ క్రీక్ రాంచ్ పార్కు (Jones Creek Ranch Park) లో నిర్వహించిన పిక్నిక్ (వనభోజహనాలు) కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనవిజయంగా పూర్తి చేసుకున్నాం. పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా ఊహించని రీతిలో రెట్టింపైన మీ ఉత్సాహాంతో పార్క్ ఆవరణంతా కేరింతలతో మార్మోగిపోయింది.
ఈ కార్యక్రమానికి దాదాపుగా 800 వందల మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పిల్లలు పెద్దలందరూ ఆటపోటీలలో ఉత్సాహంగా ఫుల్గోన్నారు అలాగే విజేతలందరికి బహుమతులందచేయటం జరిగింది. గత సంవత్సరం లాగే ట్యాగ్ (TAGH – Telangana Association of Greater Houston) జీవితకాల సభ్యత్వానికి మంచి స్పందన లభించడం ద్వారా ఎంతో మంది కొత్త సభ్యులు మరియు వారి కుటుంభాలు ఈ కార్యక్రంలో పాల్గొనడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ వన భోజనాల (Picnic) కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించటానికి మనందరి ప్రమేయం ఉన్నప్పటికీ కొంత మందిని మాత్రం ఈ సందర్బంగా మనం గుర్తించడం చాలా ముఖ్యం.
1) బిర్యానీపాట్ రెస్టారెంట్ (Biryani Pot Restaurant) వారు కేవలం తమ రుచికరమైన వంటకాలను అందించడం మాత్రమే కాకుండా వారి బృందంతో వచ్చి చివరి వరకు మనతో వుండి వారు చేసిన ప్రతి వంటకాన్ని మనం ఆస్వాదించేటట్టుగా చేసిన శ్రీధర్ కాంచనకుంట్ల, శ్రీధర్ గాదె, రవి కుకుడాల మరియు వారి బృందానికి ధన్యవాదములు తెల్పుతున్నాము.
2) చక్కటి ఆటపాటలు అందించిన DJ కిరణ్ గారికి ధన్యవాదములు.
3) చక్కని ఫోటోలు తీసి మనకందిస్తున్న విష్ణు కటుకూరి గారికి (VISH PICS) ధన్యవాదములు.
4) శ్రీ కోఠి కున్రెడ్డి (Koti Kunreddy) అధ్యక్క్షతన ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించిన సంతోష్ దీమె గారు & సుమిత్ ఆలేటి గారికి ప్రత్యేక ధన్యవాదములు
5) ఈ సంస్థ పురోగతికి సహకరిస్తున్న వాలంటీర్లందరికి, విరాళాలనందిస్తున్న దాతలందరికి (Volunteers, Donors & Logo Sponsors) ప్రత్యేక ధన్యవాదములు.
6 ) విక్రేత కేంద్రాలకు మంచి స్పందన లభించింది, వాటి నిర్వాహకులకు కృతజ్ఞతలు.
7) మా సంస్థ యొక్క కార్యనిర్వాహాక సభ్యులు, ధర్మకర్తలు మరియు సలహాదారులు (Executive Board Members, Trustees & Advisors) అందరికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం.
ఇక ముందు TAGH సంస్థ జరుపబోయే అన్ని కార్యక్రమాల్లో ఇలాగే ఉత్సాహంగా పాల్గొంటూ సహాయ సహకారాలు అందిస్తారని ట్యాగ్ కార్యనిర్వాహకవర్గం ఆశిస్తుంది.