Connect with us

Literary

పలు దేశాల కవులు, సాహితీ వేత్తలతో కొత్త సంవత్సరపు మాధుర్యాన్ని తెలిపేలా TTA సాహితీ సమ్మేళనం

Published

on

ప్రతి తెలుగువాడు, ప్రతి తెలంగాణ వాసి గర్వించేలా తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (Telangana American Telugu Association – TTA) అంతర్జాతీయ విశ్వావసు నామ సంవత్సర ఉగాది (Ugadi) సాహితీ సమ్మేళనం జరిగింది.

Telangana American Telugu Association (TTA) వ్యవస్థాపకులు డాక్టర్‌ పైళ్ళ మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వయిజరీ ఛైర్‌ డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి (Dr. Vijayapal Reddy), పూర్వాధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamsi Reddy Kancharakuntla), అధ్యక్షులు మల్లిపెద్ది నవీన్‌రెడ్డి (Mallipeddi Naveen Reddy) ల నాయకత్వాన ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన TTA ఉగాది సాహితీ సమ్మేళనం కొత్త సంవత్సరపు వాసనల్ని, ఉనికిని, సంవత్సరం ఆరంభంలోని మాధుర్యాన్ని, వినోదాన్ని, ఉత్సాహాన్ని యూ ట్యూబ్‌ ప్రసారంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రేక్షకులను అలరించింది.

ఈ ఉగాదిసాహితీ సమ్మేళనానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ గేయ రచయితలు శ్రీ రసరాజు, భువనచంద్ర, శతావధాని శ్రీరాంభట్ల, కళా పోషకులు డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్‌రెడ్డిలు, గౌరవ అతిథులు గా వివిధ అంతర్జాతీయ తెలుగు సంస్థల అధిపతులు, సాహితీవేత్తలు వంశీ రామరాజు, చిట్టెన్‌ రాజు, మూర్తి రెమిల్ల(ISRO సైంటిస్ట్ కూడా), మధు అన్నలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమెరికా, భారత్‌లతోపాటు ఇంగ్లండ్‌, సౌత్‌ ఆఫ్రికా, కెనడాలు వంటి అనేక దేశాల నుంచి కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. 

​అలరించిన సాహితీ సమ్మేళనం

ముఖ్యంగా ఈ ఉగాది సాహితీ సమ్మేళనాన్ని ప్రోగ్రాం ఆర్గనైజర్లు లిటరరీ డైరెక్టర్ శ్రీనివాస్‌ గూడూరు (Srinivas Gudur), న్యూస్ లెటర్ డైరెక్టర్ సుధాకర్‌ ఉప్పల (Sudhakar Uppala), లిటరరీ కొ-చైర్ రాజేశ్వరి బుర్రాలు (Rajeshwari Burralu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు. డిజిటల్‌గా నిర్వహించిన ఈ సాహితీ సమ్మేళనానికి ప్రేక్షకుల్ని అలరించేలా కవి సమ్మేళనాల్లో విశేష అనుభవంతోపాటు జనరంజకులైన కవుల్ని, సాహితీకారుల్ని, రచయితలను, పద్యగద్య, గేయ రచయితల్ని, ఇతర కళాకారుల్ని ఎంపికచేశారు.

రాధిక మంగిపూడి, వెంకటయోగి నారాయణస్వామి, డాక్టర్ అరుణ సుబ్బారావు, డాక్టర్ ఇస్మాయిల్‌ పెనుకొండ, శ్రీవాత్సవ శేషం, శ్రీనివాస్‌ తొడుపునూరి, డాక్టర్ మూర్తి జొన్నలగడ్డ, ఎన్ ఎన్ రెడ్డి, డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్‌, విశ్వనాధ్‌ కౌశిక్‌, శ్రీ పేరి, డాక్టర్ లలితకుమారి మైలవరపు, పార్థసారధి వూటుకూరు, కొదండరామం కూరెళ్ళ వంటి గొప్ప కవులంతా పాల్గొని టిటిఎ సాహితీ సమ్మేళనాన్ని గొప్ప చారిత్రక కార్యక్రమంగా విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (Telangana American Telugu Association – TTA) ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రవాసులందరికీ వినోదంగా, శ్రావ్యంగా కొత్త సంవత్సరపు నూతనోత్సాహాన్ని నింపేలా నిర్వహించింది. ఉగాది అంటే ‘కొత్త శకం’ అని అర్థం. చైత్ర మాసంలో (ఏప్రిల్‌ లేదా మే) ప్రారంభమయ్యే తెలుగు వారి నూతన సంవత్సర దినంగా పరిగణించబడే తెలుగు పండుగలలో ఉగాది మొదటిది.

ఉగాది పంచాంగ శ్రవణానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు, కవులు ఒకచోట చేరి కవిసమ్మేళనాలలో పద్యాలు చదివేందుకు (Telangana American Telugu Association – TTA) నిర్వహించిన ఉగాది సాహితీ సమ్మేళనం అద్భుతమైన వేదికగా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వారికి ఈ సాహితీ కవి సమ్మేళనంతో ఉగాదిని చిరస్మరణీయంగా వారి హృదయాల్లో నింపింది.

ఈ కార్యక్రమం నాలుగు గంటలకు పైగా ఎంతో సాహితీ రసస్వాదనతో నిరంతరాయంగా సాగుతూ ప్రతి ఒక్కరూ మథురానుభూతుల్ని స్వంతం చేసుకునేలా సాగిపోయింది. ఈ కార్యక్రమంలో (Telangana American Telugu Association – TTA) అడ్వయిజరీ కౌన్సిల్‌ కో చైర్‌ డాక్టర్‌ మోహన్‌రెడ్డి పటాలోళ్ళ (Dr. Mohan Reddy Patalolla), సభ్యులు భరత్‌రెడ్డి మదాడి (Bharat Reddy Madadi), శ్రీనివాస్ అనుగు (Srinivas Anugu).

మరియు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గణేష్‌ వీరమనేని (Ganesh Veeramaneni), జనరల్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల (Shiva Reddy Kolla), ట్రెజరర్‌ సహోదర్‌ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కవితారెడ్డి, మరియు మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం లో సహకరించారు.

ఈ కార్యక్రమం లో ముఖ్య పాత్రపోషించిన జనరల్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ దీపికారెడ్డి నల్లా, వెబ్‌సైట్‌ కమిటీ చైర్‌ నరేందర్‌ ఆర్‌ యారవ లను TTA లిటరరీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గూడూరు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెరవెనక సహకారం అందించిన శ్రీ శ్రీనివాస్ తోడుపునూరి, శ్రీ మూర్తి రెమెళ్ళ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు.​

​ఎలాంటి కార్యక్రమమైనా ఇంతే గొప్పగా, ప్రవాసంలోని ప్రతి తెలుగువారు, తెలంగాణ వారు గర్వించేలా నిర్వహించడం Telangana American Telugu Association – TTA ప్రత్యేకత. ఆ ప్రత్యేకతకు మరింత సొబగుల్ని అందించి అంతర్జాతీయంగా, గొప్ప వేడుకగా నిర్వహించడం టిటిఎకి మాత్రమే సాధ్యమైందని ప్రవాసంలోని ప్రతి ఒక్క తెలుగు సంస్థ, తెలుగు వారందరూ ప్రశంసలు కురిపించారు.

error: NRI2NRI.COM copyright content is protected