Connect with us

Associations

శ్రీరామ నవమి నాడు California లో NATS San Diego Chapter ఘనంగా ప్రారంభం

Published

on

San Diego, California: అమెరికాలో తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగో (San Diego) లో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి (Prashanti Udimudi), మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడి (Haima Gollamudi) కి బాధ్యతలు అప్పగించారు.

శాండియా (San Diego) గో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి (Tejaswi Kalashipudi), సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి (Ramachandra Raju Udimudi), క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్ (Satya Hariram), ఆది మోపిదేవి (Adi Mopidevi) బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  

శ్రీరామ నవమి (Sri Rama Navami) నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ (San Diego NATS) సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి (Prashanti Udimudi) అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

తనుష్ భగవత్, వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి, పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి (Madhu Bodapati), జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు.

ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ (NATS Los Angeles Chapter) నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి (Srinivas Chilukuri), జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి (Rajalakshmi Chilukuri), లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన (Murali Muddana), హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు.

నాట్స్ (NATS) ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని (Manohar Maddineni) సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి (Srihari Mandadi) తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు.

భవిష్యత్తులో శాండియాగో నాట్స్ (NATS San Diego Chapter) విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ (NATS) జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు.

అమెరికా తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి  మదన్ పాములపాటి (Madan Pamulapati) వివరించారు. శాండియాగో చాప్టర్ (NATS San Diego Chapter) ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే (Kishore Nare) కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో (San Diego) నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

error: NRI2NRI.COM copyright content is protected