Connect with us

Festivals

టొరంటోలో కనుల విందుగా Telangana Canada Association శ్రీరామ నవమి & ఉగాది వేడుకలు

Published

on

Toronto, Canada: తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాస్తవ్యులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

ఉగాది పండుగ నాడు పురోహితులు శ్రీ నరసింహాచార్యులు గారు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేయగా శ్రీరామ నవమి  నాడు పురోహితులు శ్రీ శ్రీకాంత్ కాసర్ల (Srikanth Kasarla) గారు శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలు జరిపించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా 13 సంవత్సరాల లోపు చిన్నారులకు స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటిలను నిర్వహించారు.

దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి “బెస్ట్ బ్రెయిన్స్” అధినేత శ్రీ రమేష్ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.  ఈ పోటిలో గెలిచిన చిన్నారులకు ట్రోఫిలను అందజేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association) అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem) గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.  

ఉగాది సంబరాల (Ugadi Celebrations) ను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి (Sriranjani Kanduri) గారు మరియు కుమారి వరుణి గుజ్జుల (Varuni Gujjula) నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది.

పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా, 135 కళాకారులు 23 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు.  సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు Telangana Canada Association లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తు వస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

ఉగాది కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయగా శ్రీరామ నవమి కల్యాణ ఉత్సవాలకు విచ్చేసినవారందరికీ వడపప్పు, పానకం తో కూడిన పండుగ భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో Telangana Canada Association పాలక మండలి సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem), ఉపాధ్యక్షులు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి (Shanthan Narellapalli), కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రణీత్ పాలడుగు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి శ్రీ నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీమతి శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ ఆనంద్ తొంట, శ్రీ శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీ పవన్ కుమార్ పెనుమచ్చ, శ్రీమతి మాధురి చాతరాజు, శ్రీ రాము బుధారపు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్  శ్రీ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి మరియు శ్రీ  ప్రకాష్ చిట్యాల పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected