Connect with us

Festivals

అమెరికా తిరుపతిగా పిలిచే Pittsburgh లో తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు

Published

on

Pittsburgh, Pennsylvania: అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా పిట్స్‌బర్గ్‌ (Pittsburgh) లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది.  తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది.

కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు.

ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ (NATS Pittsburgh Chapter) కోఆర్డినేటర్ రవి కొండపి (Ravi Kondapi), నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల (Ravikiran Tummala) కీలక పాత్ర పోషించారు.

వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు  వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు.  ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది.  

ఇక విందు భోజనాన్ని పిట్స్‌బర్గ్ తత్వా (Tatva Indian Restaurant) ఇండియన్ క్యూసిన్ అందించింది. సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు. ఉగాది వేడుకలకు (Ugadi Celebrations) సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం (NATS Pittsburgh Team) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్‌బర్గ్‌ టీం (NATS Pittsburgh Team) కి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected