Tampa, Florida, March 25, 2025: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఈ సారి టాంపా (Tampa, Florida) వేదికగా జరగనున్నాయి. జులై 4,5,6 తేదీల్లో జరిగే NATS అమెరికా తెలుగు సంబరాల నిర్వహణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్, నాట్స్ పాస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) నాట్స్ సంబరాల కమిటీని ప్రకటించారు.
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శిగా శ్రీనివాస్ మల్లాది (Srinivas Malladi) కి బాధ్యతలు అప్పగించారు. సంబరాల సంయుక్త కార్యదర్శిగా విజయ్ చిన్నం వ్యవహారించారు. సంబరాల కోశాధికారిగా సుధీర్ మిక్కిలినేని (Sudheer Mikkilileni), సంబరాల సంయుక్త కోశాధికారిగా రవి కానురి లకు బాధ్యతలు అప్పగించారు. ఇంకా సంబరాల కమిటీ పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శ్రీనివాస్ గుత్తికొండ – నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ప్రశాంత్ పిన్నమనేని – నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ మల్లాది – సంబరాల కార్యదర్శి విజయ్ చిన్నం – సంబరాల సంయుక్త కార్యదర్శి సుధీర్ మిక్కిలినేని – సంబరాల కోశాధికారి రవి కానురి – సంబరాల సంయుక్త కోశాధికారి ప్రసాద్ ఆరికట్ల – రెవిన్యూ జనరేషన్ డైరెక్టర్ భరత్ ముల్పూరు – రెవిన్యూ జనరేషన్ కో డైరెక్టర్ రాజేశ్ కాండ్రు – హాస్పిటాలిటీ డైరెక్టర్భా స్కర్ సోమంచి – హాస్పిటాలిటీ కో డైరెక్టర్ జగదీశ్ చాపరాల – ఫుడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గుడేటి – ఫుడ్ కో డైరెక్టర్
మాలిని రెడ్డి – డెకరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ బైరెడ్డి – డెకరేషన్స్ కో డైరెక్టర్ అచ్చిరెడ్డి – ఆపరేషన్స్ డైరెక్టర్ సుమంత్ రామినేని – ఆపరేషన్స్ కో డైరెక్టర్ విజయ్ కట్టా – మార్కెటింగ్ డైరెక్టర్ నవీన్ మేడికొండ – మార్కెటింగ్ కో డైరెక్టర్ మాధవి యార్లగడ్డ – కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ అపర్ణ – కమ్యూనిటీ సర్వీసెస్ కో డైరెక్టర్ సుధాకర్ మున్నంగి – రిజిస్ట్రేషన్ డైరెక్టర్ వేణు నిమ్మగడ్డ – రిజిస్ట్రేషన్ కో డైరెక్టర్ ప్రవీణ్ వాసిరెడ్డి – ప్రోగ్రాం డైరెక్టర్ శ్యాం తంగిరాల – ప్రోగ్రాం కో డైరెక్టర్ మాధూరి గుడ్ల – ప్రోగ్రాం కో డైరెక్టర్ల గా వ్యవహరించనున్నారు.
నాట్స్ (North America Telugu Association – NATS) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తో పాటు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి మరియు నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి 8 వ అమెరికా సంబరాల (Convention) నిర్వహణ కమిటీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.