ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి నేషనల్ కన్వెన్షన్ (Convention) 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా (Pennsylvania) లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కన్వెన్షన్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ (Short Films Competition) నిర్వహించారు. మొత్తంగా దాదాపు 1000 షార్ట్ ఫిల్మ్స్ రాగా జడ్జెస్ వాటిని వడపోసి టాప్ 10 సెలెక్ట్ చేశారు. ఇప్పుడు వీటిని చూసి మీరు వోట్ వేసి గెలిపిస్తే ఫస్ట్ ప్రైజ్ 15 లక్షలు, సెకండ్ ప్రైజ్ 10 లక్షలు, అలాగే టాప్ 100 విన్నర్స్ కి 10,116 రూపాయల చొప్పున బహుమతులు అందజేస్తారు.
మార్చి 28, 29 లలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association)నేషనల్ కన్వెన్షన్ వేదికగా విజేతలను మరియు బహుమతులను ప్రకటిస్తారు. కాబట్టి మీరందరూ ఈ 10 షార్ట్ ఫిల్మ్స్ చూసి మీకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ ని సెలెక్ట్ చేయండి. విజేతలను మీరు డిసైడ్ చేయండి. అలాగే పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న ఈ AAA మొదటి కన్వెన్షన్ కి రిజిస్టర్ చేసుకోండి.