Tampa, Florida: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే North America Telugu Society (NATS) అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి Tampa వేదికగా జూలై 4,5,6 తేదీల్లో టాంపావేదికగా నిర్వహిస్తున్నట్టు, అలాగేఅందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నామని NATS అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) ఒక ప్రకటనలో తెలిపారు.
ఫ్లోరిడా (Florida) రాష్ట్రం, టాంపా లోని టాంపాకన్వెన్షన్ సెంటరు (Tampa Convention Center) వేదికగా జరగనున్న ఈ తెలుగు సంబరాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగువారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని శ్రీనివాస్ (Srinivas Guthikonda) అన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఇప్పటికే ఏడు సార్లు ప్రతి రెండేళ్లకు అమెరికా సంబరాలను అద్భుతంగా నిర్వహించిందని.. ఈ సారి 8వ అమెరికా తెలుగు సంబరాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని NATS బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) పేర్కొన్నారు.
అమెరికాలో ఉండే తెలుగు వారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని NATS అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) పిలుపునిచ్చారు. తెలుగు వారిని అలరించే ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాల సమాహారాలు ఈ సంబరాల్లో ఉంటాయని NATS కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు.
సంబరాల నిర్వహణ కమిటీ లను ఎంపిక చేశామని, 6 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టాంపాకన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని North America Telugu Society (NATS) పేర్కొంది. రోజుకి 10 వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారనే అంచనాలతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కోసం ఆ స్థాయిలో విజయవంతానికి నాట్స్ సంబరాల కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.