ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి ఫ్లోరిడా (Florida) లోని టాంపా నగరంలో జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) ఈ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు వేదిక కానుంది.
నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు మదన్ పాములపాటి సారధ్యంలో ప్రోమోను అధికారికంగా విడుదల చేశారు. ఈ సంబరాలలో వివిధ తెలుగు సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సుమారు 15,000 మందికి పైగా హాజరుకానున్న ఈ నేషనల్ కన్వెన్షన్ కోసం ఇప్పటికే ఏర్పాటుచేసిన పలు కమిటీలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. తెలుగునాట నుంచి అతిరథ మహారథులు, కవులు, కళకారులు, ప్రముఖ సినీ నటులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సంబరాలకు విచ్చేసి అందరికీ వినోదాన్ని పంచనున్నారు.
అమెరికాలోని తెలుగువారందరూ తమ క్యాలెండర్లలో 2025 జులై 4, 5, 6 తేదీలను బ్లాక్ చేసుకోండి. భారతీయతను ముఖ్యంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప తెలుగు మహాసభలలో మీరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆస్వాదించండి. నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.sambaralu.orgని సందర్శించండి.