Connect with us

Education

Instagram అకౌంట్ క్లోజ్ చేసి JEE Main లో 100% సాధించిన టాపర్ గుత్తికొండ మనోజ్ఞ కు NATS అభినందనలు

Published

on

భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ (JEE Main) పరీక్షలో 100 శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞ (Guthikonda Sai Manogna) ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) అభినందించింది.

అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఒత్తిడి తట్టుకుని నూటికి నూరు శాతం సాధించిన మనోజ్ఞ తెలుగు విద్యార్ధులందరికి ఆదర్శంగా నిలిచారని North America Telugu Society (NATS) చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షలనైనా గట్టెక్కవచ్చనేది మనోజ్ఞ నిరూపించిందని North America Telugu Society (NATS) అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అన్నారు. మనోజ్ఞ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Joint Entrance Examination (JEE) Main కి సన్నద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా తన Instagram అకౌంట్ ని 4 సంవత్సరాలపాటు క్లోజ్ చేసినట్లు గుత్తికొండ మనోజ్ఞ (Guthikonda Sai Manogna) మీడియా కి తెలపడం అభినందనీయం.

error: NRI2NRI.COM copyright content is protected