Guntur, Andhra Pradesh: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North American Telugu Society – NATS) ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా గుంటూరులో మహిళా సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోంది.
ఈ క్రమంలోనే గత శుక్రవారం NATS ఆధ్వర్యంలో నెహ్రు యువ కేంద్రం (NEHRU YUVA KENDRA) లో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లను (Sewing Machines) పంపిణి చేశారు. పేద మహిళలు స్వశక్తితో నిలబడేలా.. సాధికారత సాధించేలా చేసేందుకు నాట్స్ తన వంతు సహకారం అందిస్తుందని నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కో ఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని (Ramakrishna Balineni) అన్నారు.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే వారి కుటుంబాలు ఆర్ధిక స్థిరత్వం సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు (MLA) భాష్యం ప్రవీణ్ (Bhashyam Praveen) తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
అలాగే పేద హై స్కూల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు (Scholarships) అందజేశారు. మహిళా సాధికారత కోసం నాట్స్‌కు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.