Delaware: బీఆర్ఎస్ USA కన్వీనర్ మహేష్ తన్నీరు పిలుపుమేరకు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Kalvakuntla Chandrashekar Rao) జన్మదిన సందర్భంగా మూడవ రక్తదాన శిబిరం, Newark సిటీ, డెలావేర్ రాష్ట్రం అమెరికాలో బీఆర్ఎస్ యూఎస్ఏ, హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ (Helping Hands Charitable Trust) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న టెల్ మార్వా బ్లడ్ బ్యాంక్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ రక్తదాన శిబిరానికి ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలు కావాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఈ రక్తదాన శిబిరం బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi – BRS) యూఎస్ఏ, భాస్కర్ పిన్న మరియు టీం సభ్యులచే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 20 నుంచి 25 మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకుని తోటి వారి ప్రాణాలకు ప్రాణదాతలుగా నిలబడుతున్నారు. రక్తదాన (Blood Donation) శిబిరాని కి వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యుడికి టిఆర్ఎస్ యూఎస్ఏ కృతజ్ఞత అభివందనాలు.