Phoenix, Arizona: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) అరిజోనా చాప్టర్ సంక్రాంతి సంబరాలు ఫిబ్రవరి 1 శనివారం రోజున ఫీనిక్స్ (Phoenix, Arizona) నగరంలోని డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ (Dream City Community Center) లో కన్వెన్షన్ రేంజ్ లో విజయవంతమయ్యాయి.
అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన చాఫ్టర్స్ అన్నింటిలోకెల్లా అరిజోనా చాప్టర్ (AAA Arizona Chapter) మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అట్లాంటా, ర్యాలీ, లాస్ వేగాస్, డల్లాస్ చాఫ్టర్లు నిర్వహించిన ఈవెంట్స్ సూపర్ హిట్ అయితే, అరిజోనా చాప్టర్ అంతకు 4 టైమ్స్ స్కేల్ లో దాదాపు 10,000 మంది ఆహ్వానితులతో అదరగొట్టింది.
ప్రీ ఈవెంట్ ప్రమోషన్స్ లోనే దుమ్ముదులిపిన AAA అరిజోనా చాప్టర్, ఫీనిక్స్ (Phoenix) నగరానికే తలమానికంగా నిలిచేలా మొట్టమొదటి ఈవెంట్ నే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా జాతీయ తెలుగు సంఘాల కన్వెన్షన్ (National Convention) స్థాయి ఈవెంట్ గా తీర్చిదిద్దింది.
ఫీనిక్స్ చుట్టుపక్కల ప్రాంతాల తెలుగువారు సైతం హాజరయ్యి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటూ పొగడడమే ఈ విజయానికి తార్కాణం. ఏదో డిస్నీ వరల్డ్ టూర్ కి కుటుంబ సమేతంగా వెళ్లినట్టు డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ (Dream City Community Center) బయట పొడుగాటి లైన్లలో వేచివున్న ప్రవాసులను చూస్తే ఈ ఈవెంట్ కోసం ఎంత ఆతృతగా వున్నారో అర్ధం అయ్యింది.
రీసెంట్ గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) ఎలక్షన్ క్యాంపైన్ నిర్వహించిన డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్ (Dream City Community Center) ని వేదికగా ఎంచుకోవడం, అంత పెద్ద వెన్యూ లో నిర్వహించే మొట్టమొదటి ఇండియన్ ఈవెంట్ కావడం, 45 కి పైగా ఆంధ్ర ప్రత్యేక వంటకాలతో ఉచిత పండుగ భోజనం అందించడం వంటి పలు కారణాలతో ఈ ఈవెంట్ పై అంచనాలు పెరిగినప్పటికీ నూటికి నూరు శాతం పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందారు.
ఇంత పెద్ద ఈవెంట్ ని ఒక్క అపశృతి కూడా లేకుండా తోలి ప్రయత్నంలోనే ఇంతటి ఘనవిజయాన్ని అందుకున్న AAA అరిజోనా చాప్టర్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గొట్టిపాటి (Kalyan Gottipati) మరియు వైస్ ప్రెసిడెంట్ నాగ జాలప్పగారి సారధ్యంలోని AAA అరిజోనా చాప్టర్ కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరినీ పేరు పేరునాతప్పకుండా అభినందించాలి.
ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ తమ పూర్తి సహకారాన్ని అందించిన AAA ఫౌండర్ హరి మోటుపల్లి (Hari Motupalli), అధ్యక్షులు బాలాజీ వీర్నాల (Balaji Veernala) సారధ్యంలోని జాతీయ నాయకులకు మరియు వారి నాయకత్వ శైలికి సైతం జేజేలు పలకాల్సిందే. ముందుగా వ్యాఖ్యాత కోమలి అందరికీ స్వాగతం పలికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గణనాథుని స్తుతిస్తూ క్లాసికల్ పాటతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. 520 మందికి పైగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), ఫ్యాషన్ షో, నృత్యాలు, సింగింగ్ ఒక ఎత్తైతే, తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ (Music Director Mani Sharma) ట్రూప్ నిర్వహించిన సంగీత విభావరి మరొక ఎత్తు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఆధ్వర్యంలోని పలువురు గాయనీగాయకులు 90’s లోని మెలోడీస్, రీసెంట్ ఇయర్స్ నుండి క్లాస్ మాస్ మసాలా పాటలతో దే సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్ అనేలా లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Concert)నిర్వహించారు. చీమలు కూడా దూరడానికి సందు లేదనేలా ఉన్న వేదిక అన్ని వైపులా ఆహ్వానితులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం విశేషం.
స్థానిక మేయర్, వివిధ ప్రభుత్వ ప్రతినిధులు, ఇండియన్ కాన్సులేట్ అధికారులు, ఒరియన్ టెక్నికల్ కాలేజ్ (Orian Technical College) రిప్రజంటేటివ్స్, స్పాన్సర్స్, పెద్దలను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. 6K HDR క్వాలిటీతో 360 డిగ్రీస్ లో కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేయడంతో కొందరు ఇంటి దగ్గిర నుంచి లైవ్ లో చూసినా కూడా చక్కని అనుభవాన్ని పొందారు.
ఫౌండర్ హరి మోటుపల్లి, అధ్యక్షులు బాలాజీ వీర్నాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరిబాబు తూబాటి ఈ సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ AAA ముఖ్య ఉద్దేశాలను, గ్రోత్ ని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆది గుప్త, శ్రీకాంత్ ఎల్లమెల్లి, సూర్య మారెళ్ల, శ్రీని అడ్డా, KVS రాజు, అశ్వని ధనియాల, రవితేజ మారినేని, మోహన్ ఆచంట, వెంకట్ బొల్లి తదితరులు పాల్గొన్నారు.
300 మంది వాలంటీర్స్ సహాయంతో గత 3 నెలలుగా ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో నిర్వహించనున్న జాతీయ కన్వెన్షన్ కి ఒక బెంచ్ మార్క్ లా నిలబెట్టారనడంలో సందేహం లేదు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (United States of Andhra Pradesh) అనేలా జనసందోహం ఉందని, నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అని పలువురు నాయకులు ప్రశంసించడం AAA అరిజోనా చాప్టర్ పనితనానికి నిదర్శనం. చివరిగా వందన సమర్పణతో అరిజోనాలో అతిపెద్ద ఈవెంట్ ని విజయవంతంగా ముగించారు.